అల్లు అర్జున్, సుకుమార్..ల ‘పుష్ప 2’ రెండో వారంలోకి ఎంట్రీ ఇచ్చింది. మొన్న అల్లు అర్జున్.. సంధ్య థియేటర్ ఘటనలో అరెస్ట్ అవ్వడం, కోర్టుకెళ్లడం, జైలుకెళ్లడం జరగడం.. నిన్న బెయిల్ పై బయటకి రావడం వల్ల ‘పుష్ప 2’ కలెక్షన్స్ పై కొంత ప్రభావం పడినట్టు అయ్యింది. అయినప్పటికీ నార్త్ వంటి ఏరియాల్లో రికార్డులని కొల్లగొట్టింది ‘పుష్ప 2’. ‘బాహుబలి 2’ పేరిట ఉన్న కొన్ని రికార్డులను కూడా ‘పుష్ప 2’ బ్రేక్ చేయడం జరిగింది.
Pushpa 2 The Rule Collections
రెండో వీకెండ్ కూడా బజ్ ఉన్న సినిమాలు లేకపోవడం వల్ల.. ‘పుష్ప 2’ కి ఎక్కువ థియేటర్లు దక్కాయి. దీంతో 10వ రోజు ఇండస్ట్రీ రికార్డు కొట్టింది పుష్ప 2. ఒకసారి 10 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే:
నైజాం
68.78 cr
సీడెడ్
26/60 cr
ఉత్తరాంధ్ర
17.63 cr
ఈస్ట్
9.39cr
వెస్ట్
7.42 cr
కృష్ణా
8.89 cr
గుంటూరు
11.96 cr
నెల్లూరు
5.62 cr
ఏపీ + తెలంగాణ (టోటల్)
156.29 cr
కర్ణాటక
33.1 cr
తమిళనాడు
10.42 cr
కేరళ
9.72 cr
ఓవర్సీస్
89.97 cr
నార్త్
211.44 cr
వరల్డ్ వైడ్ (టోటల్)
510.94 cr (షేర్)
‘పుష్ప 2’ చిత్రానికి రూ.600 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.605 కోట్ల వరకు షేర్ ను రాబట్టాల్సి ఉంది. 10 రోజులు పూర్తయ్యేసరికి ఈ సినిమా రూ.510.94 కోట్ల షేర్ ను రాబట్టి ఆల్ టైం రికార్డులు సృష్టించింది. బ్రేక్ ఈవెన్ కోసం మరో రూ.94.06 కోట్ల షేర్ ను రాబట్టాలి.