Kalpalatha: కొడుకు గురించి ‘పుష్ప’రాజ్‌ తల్లి ఏం చెప్పిందంటే?

‘పుష్ప’ సినిమాను ఇప్పటికే చూసినవారికి… అందులో తల్లి పాత్ర ఎంత కీలకమో చెప్పక్కర్లేదు. సినిమా చూడని వాళ్ల కోసం సింపుల్‌గా చెప్పాలంటే… ‘కేజీఎఫ్‌’లో తల్లి పాత్రలానే ఆ పాత్ర కూడా ఉంటుంది. అంత ప్రాముఖ్యత ఉన్న ఆ పాత్రను పోషించింది కల్పలత. కొన్ని సినిమాలకు గుర్తింపు పొందిన పాత్రలు వేసిన కల్పలత ఈ పాత్ర పోషించారు. సినిమాలో ‘పుష్ప’రాజ్‌కి తల్లిగా అదరగొట్టారనే చెప్పారు. ఎమోషనల్‌ సీన్స్‌లో కల్పలత వావ్‌ అనిపించారు.

ఈ క్రమంలో ఆమె బన్నీ గురించి మాట్లాడారు. ఆ మాటలు ఇప్పుడు వైరల్‌గా మారాయి. ‘పుష్ప’ సినిమాలో తల్లి కోసం, తల్లి ఆనందం కోసం పుష్పరాజ్‌ ఎంత కష్టానికైనా ఎదురొడ్డుతాడు. అలాగే తల్లిని ఎవరేమన్నా అంటే… మరో క్షణం ఆలోచించడు. తల బద్దలు కొట్టానికి కూడా వెనుకాడడు. అలా అని తల్లి మాటను జవదాటడు. అలాంటి పాత్రలో కనిపించాడు బన్నీ. మరి సెట్స్‌లో ఎలా ఉండేవాడు అని కల్పలతను అడిగితే… చాలా ప్రేమగా ఉండేవాడు అని చెప్పుకొచ్చారు కల్పలత.

ఒక్క ముక్కలో చెప్పాలంటే ‘బన్నీ లాంటి కొడుకు ఉండాలి’ అనిపించేలా బన్నీ ఉంటాడు అని చెప్పుకొచ్చారు. కల్పలతకు ఇద్దరు ఆడపిల్లలు. ఇద్దరూ యూఎస్‌లోనే ఉంటారు. అయితే మగపిల్లలు లేరని ఆమె ఎప్పుడూ బాధపడలేదట. అయితే బన్నీతో సినిమా చిత్రీకరణ అయ్యాక చాలా బాధపడ్డారట. సినిమాలో బన్నీ సపోర్ట్‌గా చేయి పట్టుకోవడం, నేనున్నానంటూ కళ్లతోనే ధీమా ఇవ్వడం ఇవన్నీ చూసి ఏడ్చేశారట కల్పలత. కొడుకుంటే ఇంత బాగా చూసుకునేవాడేమో అనిపించిందట. కొడుకు ప్రేమ ఇంత బాగుంటుందా? అనిపించిందట కల్పలతకు.

పుష్పరాజ్‌లాంటి కొడుకుంటే జీవితం మరింత బాగుండు అని ఫీలయ్యారట కల్పలత. ఇదే మాట బన్నీకి చెప్తే ఆయన దగ్గరకు తీసుకుని ఓదార్చాడని కల్పలత చెప్పుకొచ్చారు. ఇక బన్నీ సెట్స్‌లో ఎలా ఉంటాడో కూడా చెప్పారామె. సెట్స్‌కి లోకి వచ్చాడంటే అల్లు అర్జున్‌ చాలావరకు తన పాత్ర గురించే ఆలోచిస్తుంటాడట. వ్యక్తిగత విషయాలను పక్కనపెట్టి ఆ పాత్రలో లీనమైపోతాడట. బన్నీకి అంత డెడికేషన్‌ ఉంది అని చెప్పారు కల్పలత.

శ్యామ్ సింగరాయ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

83 సినిమా రివ్యూ & రేటింగ్!
వామ్మో.. తమన్నా ఇన్ని సినిమాల్ని మిస్ చేసుకుండా..!
‘అంతం’ టు ‘సైరా’.. నిరాశపరిచిన బైలింగ్యువల్ సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus