Raashi Khanna: ఆ సినిమాకి ఆడిషన్ ఇవ్వనంటూ మారాం చేసిన రాశీ ఖన్నా?

రాశీ ఖన్నా.. కి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. స్టార్ హీరోయిన్ అనే ఇమేజ్ కు కొద్ది దూరంలో ఆగిపోవడం ఈమెకు మైనస్ అయ్యింది. ‘ఊహలు గుసగుసలాడే’ చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఈమె అంతకు ముందు ‘మనం’ సినిమాలో నటించినా..హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న సినిమా అయితే ‘ఊహలు గుసగుసలాడే’ అనే చెప్పాలి. అటు తర్వాత ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించినప్పటికీ ఈమె స్టార్ హీరోయిన్ గా ఎదగలేకపోయింది.

అందుకు కారణాలు ఏంటి అంటే.. ఎవ్వరి దగ్గర ఏమీ లేవు. ఈమెకు ఎన్టీఆర్ తప్ప మరే స్టార్ హీరో కూడా ఛాన్స్ ఇవ్వలేదు. ఎన్టీఆర్ తో మాత్రం ‘జై లవ కుశ’ అనే సినిమాలో నటించింది. ఇదిలా ఉండగా.. ఈ మధ్య కాలంలో రాశీ ఖన్నాకి చెప్పుకోదగ్గ అవకాశాలు లేవు. అడపాదడపా బాలీవుడ్ సినిమాల్లోనూ, వెబ్ సిరీస్ లలోనూ నటిస్తుంది. ఈ క్రమంలో ఆమె ‘ఫర్జీ’ తో సూపర్ సక్సెస్ అందుకుంది.

మన దగ్గర ఏమో కానీ బాలీవుడ్ మీడియా వద్ద మాత్రం ఈమె ఎవ్వరికీ తెలియని విషయాలు, ముఖ్యంగా టాలీవుడ్ మీడియా వద్ద చెప్పని విషయాలు చాలానే చెబుతుంది. ఈ క్రమంలో కెరీర్ ప్రారంభంలో ఈమె ఓ సినిమాకి ఆడిషన్ ఇవ్వను అని పారిపోయింది.

అది (Raashi Khanna) ఈమె మొదటి సినిమా మద్రాస్ కేఫ్ కే అని చెప్పాలి. చాలా మంది సెలబ్రిటీల మధ్య ఆడిషన్ ఇచ్చే ధైర్యం లేక ఈమె పారిపోయింది. తర్వాత ఆర్ట్ పై ఉన్న రెస్పెక్ట్ తో ‘మద్రాస్ కేఫ్’ కి ఆడిషన్ ఇచ్చి సెలెక్ట్ అయినట్టు తెలిపింది.

ఏజెంట్ సినిమా రివ్యూ & రేటింగ్!
పొన్నియన్ సెల్వన్సినిమా రివ్యూ & రేటింగ్!

బట్టలు లేకుండా నటించిన వారిలో ఆ హీరోయిన్ కూడా ఉందా?
పెళ్లికి ముందు గర్భవతి అయిన హీరోయిన్స్.. ఈ లిస్ట్ లో ఆ హీరోయిన్ కూడా ఉందా

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus