అతని వల్ల మానసికంగా కృంగిపోయాను: టాలీవుడ్ హీరోయిన్

‘ఊహలు గుసగుసలాడే’ (Oohalu Gusagusalade) ‘బెంగాల్ టైగర్’ (Bengal Tiger) ‘తొలిప్రేమ’ (Tholi Prema) ‘ప్రతిరోజూ పండగే’ (Prati Roju Pandage) వంటి విజయవంతమైన సినిమాలతో స్టార్ హీరోయిన్ గా రాశీ ఖన్నా (Raashi Khanna) ఎదిగింది. అయితే కొన్నాళ్లుగా ఈమెకు టాలీవుడ్లో సక్సెస్..లు లేవు. దీంతో బాలీవుడ్‌ పై ఫోకస్ పెట్టింది. వరుసగా అక్కడ సినిమాల్లో, వెబ్ సిరీస్..లలో నటిస్తూ హాట్ టాపిక్ అవుతుంది. త్వరలో ‘ది సబర్మతీ రిపోర్ట్’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. న‌వంబ‌ర్ 15న విడుదల కానుంది ఈ చిత్రం.

Raashi Khanna

ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో తన పర్సనల్ లైఫ్ గురించి, ముఖ్యంగా తన లవ్ స్టోరీ గురించి చెప్పి వార్తల్లో నిలిచింది ఈ బ్యూటీ. ఈ విషయం పై రాశీ ఖన్నా(Raashi Khanna) మాట్లాడుతూ.. “గతంలో నాకు కూడా ఓ ల‌వ్ స్టోరీ ఉంది. ఓ వ్యక్తిని నేను మనసారా ప్రేమించాను. కొన్ని రోజులు బాగానే ఉన్నాం. కానీ అటు త‌ర్వాత మ‌న‌స్ప‌ర్థల వచ్చాయి. దీంతో బ్రేకప్ అయిపోయాం. నా ప్రేమలో నిజాయితీ ఉంది. అందుకే నేను దాన్ని తీసుకోలేకపోయాను.

బాగా కృంగిపోయి డిప్రెషన్‌లోకి వెళ్లిపోయాను.కొన్నాళ్ల తర్వాత నా స్నేహితులు, బంధువుల‌ మోరల్ సపోర్ట్ వల్ల నా కెరీర్‌పై దృష్టి పెట్టాను. కొన్నాళ్ళకి నార్మల్ అయ్యాను.నేను సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి చాలా కాలం అయ్యింది. అయినప్పటికీ నాకు సినీ పరిశ్రమలో కంటే బయటే ఎక్కువ మంది ఫ్రెండ్స్ ఉన్నారు” అంటూ రాశీ ఖన్నా(Raashi Khanna) బ్రేకప్ స్టోరీని చెప్పుకొచ్చింది.

శ్రీలీలలోని ప్లస్ పాయింట్ ని వాడుకున్న ‘పుష్ప 2’ టీం!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus