అబ్బా.. ఇప్పుడు మనిషి ఉదయం నిద్ర లేచిన దగ్గర్నుండీ.. మళ్ళీ రాత్రి పడుకునే వరకూ పలకరించే పేరు కరోనానే అయ్యుంటుంది. ఈ వైరస్ మహమ్మారికి పేద గొప్ప అనే తేడా లేదు. అందుకే సామాన్యులతో పాటు సెలబ్రిటీలను కూడా పీడిస్తుంది. ఇప్పటికే టాలీవుడ్ ప్రొడ్యూసర్ బండ్ల గణేష్, ‘బిగ్ బాస్’ ఫేమ్ రవికృష్ణ వంటి వారు కరోనా భారిన పడ్డారు. ఇక ప్రముఖ నిర్మాత పోకూరి రామారావు కూడా దీని భారిన పడి ప్రాణాలు కోల్పోయారు.
అంతెందుకు మన బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్ అలాగే ఆయన కొడుకు అభిషేక్ బచ్చన్, కోడలు ఐశ్వర్య రాయ్ వంటి వారు కూడా కరోనా భారిన పడ్డారు. దీంతో సినీ సెలబ్రిటీలు కూడా వణికిపోయే పరిస్థితి ఏర్పడింది. తాజాగా ‘రేసుగుర్రం’ విలన్ రవికిషన్ కు కూడా కరోనా భయం పట్టుకున్నట్టు తెలుస్తుంది. వివరాల్లోకి వెళితే…ఉత్తర ప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌కు చెందిన బీజేపీ ఎంపీ మరియు భోజ్ పురి సూపర్ స్టార్ అయిన రవికిషన్.. పీఏకి కరోనా సోకిందట. ఈ విషయాన్ని స్వయంగా రవికిషనే వెల్లడించారు. రవికిషన్ మాట్లాడుతూ.. “నా దగ్గర పని చేస్తున్న గుడ్డూ పాండే కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు.
ఈ మధ్యనే టెస్టులు చేస్తే.. అతనికి కరోనా సోకిందని తేలింది. దీంతో అతన్ని ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నాం. గుడ్డూ త్వరగా కోలుకోవాలని ప్రార్ధిస్తున్నాను” అంటూ చెప్పుకొచ్చాడు. తన పిఏకి కరోనా సోకిందనే విషయం తెలిసిన వెంటనే రవికిషన్‌తో సహా అతని అనుచరులు కూడా కరోనా టెస్ట్‌లు చేయించుకుని .. క్వారంటైన్ కు వెళ్లిపోయారట. రవికిషన్.. తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే.అల్లు అర్జున్ సూపర్ హిట్ మూవీ ‘రేసుగుర్రం’ లో ఈయన విలన్ గా నటించాడు. ఆ తరువాత సాయి తేజ్ .. ‘సుప్రీమ్’, మెగాస్టార్ చిరంజీవి ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రాలలో కూడా ఈయన నటించాడు.