ఉత్కంఠత రేపుతున్న ఇండియన్ ఐడల్ రేస్ టు ఫినాలే..!

ఇండియన్ ఐడల్ ను తెలుగు ప్రేక్షకులకి కూడా పరిచయం చేశారు ఆహా వారు. ఈ షో ద్వారా గాన గంధర్వులను వెలికి తీసే గొప్ప పనికి శ్రీకారం చుట్టారు. ఈ షో తెలుగు ప్రేక్షకులను అమితంగా అలరిస్తుంది.ఎంతో మంది ప్రతిభని గుర్తించే ఇలాంటి షోలు ఈ మధ్య కాలంలో తక్కువైపోయాయి. ఇందుకు గాను ఆహా వారిని మెచ్చుకుని తీరాల్సిందే. బిగ్ బాస్5 టాప్ 5 కంటెస్టెంట్ మరియు టాప్ సింగర్ అయిన శ్రీరామ్ చంద్ర ఈ షోకి హోస్ట్ గా వ్యవహరిస్తున్నాడు.

తమన్, నిత్యా మేనన్ వంటి స్టార్లు ఈ షో కి జడ్జిలుగా చేస్తుండడంతో మరింత ఆకర్షణ చేకూరింది.ఇక తాజా ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమోని తాజాగా విడుదల చేసారు. ఇది రేస్ టు ఫినాలే ఎపిసోడ్ కావడం దీని ప్రత్యేకత. ఈ ఎపిసోడ్ కు మేజర్ హీరో హీరోయిన్లు అయిన అడివి శేష్, శోభిత ధూళిపాళ స్పెషల్ గెస్టులుగా విచ్చేశారు. ఈ క్రమంలో అడివి శేష్ నటించిన పంజా చిత్రంలోని టచ్ మీ అనే పాటని వాగ్దేవి చాలా ఎనర్జిటిక్ గా పాడింది.

ఆమె పాడిన తీరుకి అడివి శేష్ ఫిదా అయిపోయాడు. దాంతో ఆమె పై ప్రశంసలు కురిపించారు. ఇక ప్రోమో చివర్లో ఈ షో తుది దశకు చేరుకుందని, ఫినాలే కి వెళ్ళే ఆ 6 మంది కంటెస్టెంట్లు ఎవరు అనే సస్పెన్స్ తో ఈ ప్రోమోని కట్ చేసి ఎపిసోడ్ పై ఆసక్తిని పెంచారు. మే 27,28 న రేస్ టు ఫినాలే ఎపిసోడ్స్ కు సంబంధించిన ప్రీమియర్స్ స్ట్రీమింగ్ కానున్నాయి

Share.