రచన.. తెలుగు ప్రేక్షకులకు పరిచయం చెయ్యక్కర్లేదు.. కోల్‌కతాలో పుట్టి పెరిగిన రచన పూర్తి పేరు ఝుంఝుమ్ బెనర్జీ.. రచనా బెనర్జీ స్క్రీన్ నేమ్.. తర్వాత రచనగా మారింది.. తెలుగుతో పాటు హిందీ, తమిళ్, కన్నడ, ఒడియా భాషల్లోనూ నటించిందామె.. టీవీ రియాలిటీ షోలలోనూ అలరిచిన రచన 1993లో బెంగాలీ చిత్రాలతో నటిగా కెరీర్ స్టార్ట్ చేసింది.. తెలుగులో ‘కన్యాదానం’, ‘పవిత్ర ప్రేమ’, ‘సుల్తాన్’, ‘రాయుడు’, ‘మావిడాకులు’, ‘అభిషేకం’, ‘బావగారు బాగున్నారా’, ‘లాహిరి లాహిరి లాహిరిలో’ సినిమాలతో నటిగా గుర్తింపు తెెచ్చుకుంది..
వెంకటేష్ ‘సూర్యవంశం’ లో సంఘవి చేసిన క్యారెక్టర్ హిందీలో చేసింది.. 2007లో ప్రొబల్ బసుని పెళ్లి చేసుకుంది.. వీరికి ఓ బాబు ఉన్నాడు.. సినిమాలకు దూరంగా ఉంటున్న రచన.. ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఫ్యాన్స్ ఇంకా నెటిజన్లకు అందుబాటులో ఉంటుంది.. ఆమె పిక్స్, వీడియోస్ చూసి ‘చాలా మారిపోయారు’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.. 49 ఏళ్ల వయసులోనూ గ్లామర్ బాగా మెయింటెన్ చేస్తుంది రచన..
రెమ్యూనరేషన్ విషయంలో తగ్గేదే లే అంటున్న టాప్ 10 తెలుగు దర్శకులు!
విదేశాల్లో ఎక్కువగా కలెక్ట్ చేసిన 10 ఇండియన్ సినిమాలు!
2023 టాప్ 10 తెలుగు హీరోయిన్లు వాళ్ళ రెమ్యూనరేషన్స్.!
మనోజ్ టు అభిరామ్.. పెద్దోళ్ల సపోర్ట్ కు దూరంగా ఉన్న వారసుల లిస్ట్