‘రాధేశ్యామ్’ సినిమాకు సంగీత దర్శకులు ఎంత మంది, ఎవరెవరు? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాలంటే ఒకసారి వికీపీడియా పేజీలోకి వెళ్లాల్సిందే. సౌత్ వరకు ఫర్వాలేదు చెప్పేయొచ్చు కానీ, హిందీ విషయానికొస్తే మాత్రం కచ్చితంగా ఇంటర్నెట్. ఎందుకంటే సినిమాకు అంతమంది సంగీత దర్శకులు అక్కడ. ఒకరైతే ఓకే కానీ, ఎక్కువమంది అయితే వాళ్ల పేర్లు మనకు అంతగా గుర్తుండవు కాబట్టే ఆ సమస్య. ఇప్పుడు ఆ లిస్ట్‌లో మరొకరు కలుస్తున్నారా? టాలీవుడ్‌లో గత కొన్ని రోజులుగా సంగీతం,
బ్యాగ్రౌండ్ స్కోరు అంటే తమన్ పేరే గుర్తొస్తోంది. కారణం ‘అఖండ’ సినిమాకు తమన్ ఇచ్చిన సంగీతం ఎఫెక్ట్. చాలా రోజుల తర్వాత టాలీవుడ్‌కి సరైన హిట్ పడటం, అందులో తమన్ అందించిన సంగీతం ప్రముఖంగా నిలవడమే కారణం. ఇప్పుడు తమన్ గురించి ఎందుకు అంటున్నారా? ‘రాధేశ్యామ్’ సినిమా నేపథ్య సంగీతం విషయంలో తమన్ పేరు వినిపిస్తోంది కాబట్టి. ‘రాధేశ్యామ్’ చిత్రీకరణ, ఇతర పనులు పూర్తై చాలా రోజులైంది. అయితే కొన్ని రీషూట్లు, ఎడిట్లు లాంటివి జరుగుతున్నాయి.
ఇప్పుడు నేపథ్య సంగీతంలోనూ మార్పులు చేస్తారని అంటున్నారు. సౌత్ మాత్రమే కాకుండా హిందీకి కూడా జస్టిన్ ప్రభాకరనే ఆర్‌ఆర్ అందించారు. ఇప్పుడు తమన్ కూడా సినిమా మీద ఓ చేయి వేస్తే బాగుంటుంది అనేది చిత్రబృందం అభిప్రాయమని సమాచారం. అయితే ఇప్పుడు ఆ మార్పులు చేస్తారా అనేది చూడాలి. ఓకే హిందీ దర్శకుల పేర్లు గుర్తొచ్చాయా? వాళ్లే మిథూన్, అమాల్ మాలిక్, మనన్ భరద్వాజ్.
Most Recommended Video
‘అఖండ’ మూవీ నుండీ గూజ్ బంప్స్ తెప్పించే 15 డైలాగ్స్..!
సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి గురించి మనకు తెలియని విషయాలు..!
22 ఏళ్ళ రవితేజ ‘నీకోసం’ గురించి ఆసక్తికరమైన విషయాలు…!