Raghava Lawrence: కమల్‌ ‘విక్రమ్‌’ సినిమాలో ఆ పాత్ర గురించి ఆసక్తికర విషయం తెలుసా?

ఒక సినిమాలో నటించిన ప్రధాన పాత్రలన్నింటికీ పేరు రావడం చాలా అరుదు. ఆ దర్శకుడు ఎంతో తెలివిగా అన్నింటికీ ప్రాధాన్యం ఉన్నట్లు రాసుకుంటే కానీ ఆ పేరు రాదు. అలాగే ఆ నటులు ఎంతో గొప్పగా చేస్తే కానీ రాదు. అలా గొప్పగా రాసి, చేసి పేరు సంపాదించుకున్న పాత్ర సంతానం. కమల్ హాసన్‌ ‘విక్రమ్‌’ సినిమాలో విజయ్‌ సేతుపతి పోషించిన పాత్ర ఇది. ఈ పాత్రలో విజయ్‌ నటనకు మంచి పేరొచ్చింది. అయితే ఈ పేరంతా లారెన్స్‌కు రావాల్సిందా? ఈ వార్త చదివాక మీరు ఇదే మాట అంటారు.

సినిమాల్లో ఒకరు నటించాల్సిన పాత్రను మరొకరు పోషించడం సర్వ సాధారణం. తమ దగ్గరకు వచ్చిన అవకాశాలను కొన్ని కారణాల వల్ల కొందరు తిరస్కరిస్తారు. అలా వచ్చిన అవకాశాలను వేరొకరు సద్వినియోగం చేసుకుంటారు. ఆ జాబితాలోకే రాఘవ లారెన్స్‌, విజయ్‌ సేతుపతి చేరారు. అయితే ఇది ఇప్పుడు కాదు. గతేడాది జరిగింది. ‘విక్రమ్‌’ సినిమాలోని సంతానం పాత్రను తొలుత లారెన్స్‌ దగ్గరకు వచ్చిందట. కానీ ఆయన నో అనడంతో విజయ్‌ సేతుపతిలో రంగంలోకి దిగారు అని సమాచారం.

లోకేశ్‌ కనగరాజ్‌ తెరకెక్కించిన ‘విక్రమ్‌’ సినిమా గతేడాది విడుదలై ఘన విజయం అందుకుంది. మళ్లీ చాలా రోజుల తర్వాత కమల్‌కు మంచి కమర్షియల్‌ హిట్‌ ఇచ్చింది. ఏజెంట్‌ అరుణ్‌ కుమార్‌ విక్రమ్‌గా కమల్‌ హాసన్‌, ఏజెంట్‌ అమర్‌గా ఫహాద్‌ ఫాజిల్‌, సంతానం పాత్రలో విజయ్‌ సేతుపతి అదరగొట్టారు. విభిన్నమైన మ్యానరిజంతో సేతుపతి వావ్‌ అనిపించారు అని చెప్పాలి. నెగెటివ్‌ ఛాయలున్న ఆ పాత్రను లారెన్స్‌ చేసుంటే.. ఇంకాస్త డిఫరెంట్‌గా ఉంటుంది కదా. అందుకే లోకేశ్‌ ఆ పాత్రను తొలుత లారెన్స్‌కే చెప్పారట.

అయితే, ఆ సమయంలో  (Raghava Lawrence) లారెన్స్‌ ఇతర ప్రాజెక్టులతో బిజీగా ఉండడంతో డేట్స్‌ సర్దుబాటు చేయలేక నో చెప్పారట. దాంతో విజయ్‌ సేతుపతిని తీసుకున్నారట. ఈ విషయాన్ని లారెన్స్‌ ఇటీవల చెప్పుకొచ్చారు. అయితే ఆ సినిమా పోయినా.. అతను రాసుకున్న మరో కథలో నటిస్తున్నా అని లారెన్స్‌ చెప్పారు. నయనతార హీరోయిన్‌గా నటిస్తున్న ఆ సినిమాకు లోకేశ్‌ శిష్యుడు దర్శకత్వం వహిస్తున్నారట.

శాకుంతలం సినిమా రివ్యూ & రేటింగ్!
అసలు పేరు కాదు పెట్టిన పేరుతో ఫేమస్ అయినా 14 మంది స్టార్లు.!

బ్యాక్ టు బ్యాక్ ఎక్కువ ప్లాపులు ఉన్న తెలుగు హీరోలు ఎవరంటే?
పూజా హెగ్డే కంటే ముందు సల్మాన్ ఖాన్ తో డేటింగ్ చేసిన 13 మంది హీరోయిన్లు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus