శ్రీదేవి…అలా పిలవడం కన్నా…ఆతిలొక సుందరి అంటే అందరికీ ఇట్టే అర్ధం అయిపోతుంది. గుర్తుకు వస్తుంది. అయితే ఈ అందాల భామ అప్పట్లో యువతను తన అందంతో, తన అభినయంతో కట్టిపడేసింది. ఇప్పటికీ శ్రీదేవి అంటే పడి చచ్ఛేవాళ్ళు ఉన్నారు అంటే అతిశయోక్తి కాదు. అయితే దాదాపుగా తెలుగు, తమిళ, హిందీ,మళియాళ బాషల్లో ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో నటించి ఆల్ ఇండియా స్టార్ గా పేరు తెచ్చుకుంది శ్రీదేవి. చిన్న నాటి నుంచే బాలనటిగా ఎంట్రీ ఇచ్చిన శ్రీదేవి దర్శకులు రాఘవేంద్ర రావు తెరకెక్కించిన ‘పదహారేళ్ల వయసు’ చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత తెలుగు, తమిళ ఇండస్ట్రీలో అగ్రనటులతో నటించి తక్కువ కాలంలో ఎంతో పేరు తెచ్చుకుంది. ఇక ఇదిలా ఉంటే కొంతకాలం తరువాత హిందీలో ఎంట్రీ ఇచ్చి అక్కడ సూపర్ సినిమాల్లో నటించి మంచి పేరు తెచ్చుకోవడమే కాకుండా…బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ బోనీ కపూర్ ని వివాహం చేసుకొని అక్కడే స్థిరపడింది. అయితే కొన్నాళ్ళ గ్యాప్ తరువాత శ్రీ దేవి తన రెండో ఇన్నింగ్స్ మొదలు పెట్టిన సంగతి అందరికీ తెలిసిందే…అదే క్రమంలో తాజాగా దేవి ప్రధాన పాత్రలో రవి ఉద్యవార్ దర్శకత్వంలో మ్యాడ్ ఫిలింస్, థర్డ్ ఐ పిక్చర్స్ పతాకాలపై నిర్మాణం జరుపుకుంటున్న విభిన్న కథా చిత్రం ‘మామ్. ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ విడుదల కార్యక్రమం శుక్రవారం హైదరాబాద్‌లో జరిగింది.
ఈ కార్యక్రమంలో దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు మాట్లాడుతూ…శ్రీదేవిని తెగ పొగిదేశాడు…శ్రీ దేవి గురించి మాట్లాడుతూ…సాధారణంగా సినిమా రివ్యూలు చూసిన తర్వాత ఆ సినిమాకి వెళ్లాలా లేదా.. అని ఆలోచిస్తాం. కానీ శ్రీదేవి నటించిన ఏ చిత్రం అయినా ఏలాంటి రివ్యూలు చూడకుండా వెళ్తాం..ఎందుకంటే..హండ్రెడ్ పర్సెంట్ గ్లామర్‌గా వుంటుంది. యాక్టింగ్ ఇరగ్గొడుతుంది. హండ్రెడ్ పర్సెంట్ డాన్స్ బాగా చేస్తుంది. ఇన్ని క్వాలిటీస్ వున్న తర్వాత హండ్రెడ్ పర్సెంట్ బాగుంటుంది అన్నారు. అంతేకాకుండా సెకెండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన శ్రీదేవి ఇలాంటి కధను ఎంచుకోవడం నిజంగా గొప్ప విషయం అని. ఈ సినిమా ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది అని రాఘవేంద్ర రావు జోశ్యం పలికారు…
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.