సింగిల్ సాంగ్స్… ఈ మాట వినగానే మనకు ఠక్కున బాలీవుడ్ గుర్తొచ్చేస్తుంది. లేదంటే పంజాబీ సింగర్స్ గుర్తొస్తారు. ఎందుకంటే అక్కడి సింగ్స్ వరుసగా సింగిల్స్ చేస్తూ ఉంటారు. ఒక్కోపాటకు మిలియన్ల కొద్దీ వ్యూస్ వచ్చి భారీ విజయాలు అందుకుంటూ ఉంటాయి. అయితే అప్పుడప్పుడు తెలుగులో కూడా ఇలాంటి పాటలు వస్తాయి. హిందీలో అయితే ఇలాంటి పాటల్లో అందాల వడ్డన కాస్త జోరుగానే ఉంటుంది. తెలుగులో అయితే ఇలాంటివి తక్కువే. అయితే లేటెస్ట్‌గా ఓ పాట వచ్చి మొత్తం లెక్క మార్చేసింది.
ఆ పాటే ‘నీ అయ్యా.. నా మామ..’. రాహుల్ సిప్లిగంజ్ పాడి, ఆడి అదరగొట్టిన పాట అది. వెస్ట్రన్ బీట్‌కి, తెలంగాణ ఫోక్స్ మిక్స్ చేసి పాటలు పాడే రాహుల్ సిప్లిగంజ్… ఇప్పుడు అలాంటి స్టైల్‌లోనే ఈ పాట చేశాడు. అయితే ఈసారి అరబిక్ స్టైల్‌ను కూడా తీసుకున్నాడు. దానికి జెన్నిఫర్ ఇమ్మాన్యుయేల్ లాంటి ఇంగ్లిష్ అందాన్ని జోడిండచంతో సొగసుల విరివిగా కురిశాయి అని చెప్పాలి. గతంలో ‘మంగమ్మ’ అంటూ ఇలానే ఓపాట చేసి రాహుల్ వావ్ అనిపించాడు.
‘నీ అయ్య నా మామ..’ పాట మొత్తం దుబాయిలోనే షూట్ చేశారు. కాసర్ల శ్యామ్ సాహిత్యం అందించిన ఈ పాటకు తనదైన మ్యూజిక్ అందించి వావ్ అనిపించారు. వినసొంపుగా ఉంటూనే కొత్తగా ఉండటంతో యూట్యూబ్‌లో ఈ పాటను తెగ చూసేస్తున్నారు. సినిమా పాటకు ఏమాత్రం తీసిపోకుండా ఉంది అనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. పాట విడుదలైన గంటల్లోనే లక్షలకొద్దీ వ్యూస్ వస్తున్నాయి. మరోవైపు ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కూడా ఈ పాటకు ప్రశంసలు కురిపించారు.
ఆ మధ్య (Rahul Sipligunj) రాహుల్ సిప్లిగంజ్‌కు సంబంధించిన కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆ ఫొటోలు ఇప్పుడు ఆ వీడియోలో కనిపిస్తాయి. అవేంటి, ఎలాంటివి అనేది ఆ పాటలో మీరు చూడొచ్చు. మంచి మాస్ మ్యూజిక్, క్లాస్ బ్యూటీ కావాలంటే పాటను ఓ చూపుచూసేద్దురు.
మా ఊరి పొలిమేర 2 సినిమా రివ్యూ & రేటింగ్!
కీడా కోలా సినిమా రివ్యూ & రేటింగ్!
నరకాసుర సినిమా రివ్యూ & రేటింగ్!