అషూ రెడ్డితో రిలేషన్.. బయటపడిపోయిన రాహుల్ సిప్లిగంజ్..!

ప్రముఖ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ గురించి ‘బిగ్ బాస్3’ మొదలయ్యే ముందు వరకూ పెద్దగా ఎవ్వరికీ తెలియకపోయి ఉండచ్చు. కానీ ‘బిగ్ బాస్’ హౌస్ లో అడుగుపెట్టిన తర్వాత.. హౌస్ లో అతను కంటెస్టెంట్ పునర్నవితో రొమాన్స్ చెయ్యడం.. శ్రీముఖితో గొడవ పడటంతో ఎక్కువ ఫేమస్ అయ్యాడు. ఎవ్వరూ ఊహించని విధంగా ‘బిగ్ బాస్3’ విన్నర్ కూడా అయ్యాడు. హౌస్ లో ఉన్నన్ని రోజులు ఒక్కసారి కూడా కెప్టెన్ అవ్వని రాహుల్.. ఏకంగా విన్నర్ అవ్వడం అందరినీ షాక్ కు గురి చేసిందనే చెప్పాలి.

ఇదిలా ఉండగా.. బిగ్ బాస్ విన్నర్ లు అయిన వాళ్ళకి అప్పటివరకూ అది ఏ విధంగానూ కలిసి రాలేదు. శివ బాలాజీ, కౌశల్ వంటి వారు ‘బిగ్ బాస్’ విన్నర్లు అయినా వారికి సినిమా అవకాశాలు రాలేదు. కానీ రాహుల్ మాత్రం కృష్ణవంశీ డైరెక్షన్లో తెరకెక్కుతోన్న ‘రంగ మార్తాండ’ చిత్రంలో ఛాన్స్ కొట్టేసాడు. ఇప్పుడు అతన్ని చాలా సినిమాల ప్రమోషన్లకు కూడా తెగ వాడేస్తున్నారు. అయితే మొన్నటి వరకూ పునర్నవితో రాహుల్ ప్రేమలో ఉన్నట్టు వార్తలు వచ్చాయి.

కానీ ఇప్పుడు మరో ‘బిగ్ బాస్3’ కంటెస్టెంట్ అయిన అషూ రెడ్డితో రాహుల్ రిలేషన్ షిప్ లో ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. వీటికి రాహుల్ తాజాగా క్లారిటీ ఇచ్చాడు. ‘యస్.. అషూరెడ్డితో నేను రిలేషన్‌షిప్ లో ఉన్నాను’.. అంటూ కామెంట్ చేసి షాక్ ఇచ్చాడు. ఆ వెంటనే ‘మా మధ్యన ఉన్నది ‘మీరు అనుకునే రిలేషన్ కాదు! అషూ నాకు ‘జిగిరీ దోస్త్ ‘ . అంటే ఎవ్వరూ విడదీయలేనటువంటి స్నేహితురాలు’ అంటూ అషూ ని ట్యాగ్ చేసాడు. రాహుల్ పెట్టిన ఈ కామెంట్‌కు అషూ.. ‘లవ్ ఎమోజీని’ పెట్టింది.

1

2

3

4

5

6

7

8

9

10

Most Recommended Video

భానుమతి & రామకృష్ణ సినిమా రివ్యూ & రేటింగ్!
సినిమాల్లోకి రాకముందు మన హీరోయిన్స్ ఎలా ఉంటారో చూస్తే.. షాక్ అవ్వాల్సిందే..!
అట్టర్ ఫ్లాప్ సీజన్ అంటే ఇదేనేమో..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus