రాజ్‌తరుణ్‌, `శివాని రాజశేఖర్ ల కామెడీ, రొమాన్స్‌ ‘అహ నా పెళ్ళంట’ ZEE5 ఒరిజినల్ వెబ్ సిరీస్ ప్రారంభం

ఎన్నో ఏళ్లుగా పెళ్ళికోసం ఎదురు చూసి పెళ్లి పేటలెక్కిన వ్యక్తికి తాళి కట్టే సమయంలో పెళ్లి కూతురు ఆమె బాయ్ ఫ్రెండ్ తో లేచిపోవడంతో వారిద్దరిపై ఆ పెళ్లి కొడుకు ఎలాంటి ప్రతీకారం తీర్చుకున్నాడు అనే కథంతో కామెడీ రొమాన్స్ ఎంటర్టైనర్ గా తెరకెక్కనున్న ZEE5 ఒరిజినల్ వెబ్ సిరీస్”అహ నా పెళ్ళంట’.

Click Here To Watch NOW

ZEE5 మరియు తమడ మీడియా వారి భాగస్వామ్యంలో నిర్మిస్తున్న ఈ వెబ్ సిరీస్ లో రాజ్‌తరుణ్‌, శివాని రాజశేఖర్‌ జంటగా నటిస్తున్నారు. ‘ఏబీసీడీ’కి దర్శకత్వం వహించిన సంజీవ్‌రెడ్డి దర్శకత్వం వహిస్తుండగా రాహుల్‌ తమడ, సాయిదీప్‌రెడ్డి బుర్రలు నిర్మాతలు.ఈ ‘అహ నా పెళ్ళంట’ వెబ్‌ సిరీస్‌ పూజా కార్యక్రమాలు రాజమండ్రిలోని గరిమొళ్ల సత్యనారాయణ (ట్రైనింగ్‌ కాలేజ్‌)లో ఆదివారం ఉదయం ఘనంగా జరుపుకుంది. ఈ కార్యక్రమానికి ఎంపీ మార్గాని భరత్‌, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌, చందన నాగేశ్వరావ్‌, కందుల దుర్గేష్‌, ఆదిరెడ్డి వాసు, గాదంశెట్టి శ్రీధర్‌, ZEE5 నుంచి పూర్ణ ప్రజ్ఞ, రాధకృష్ణవేణి తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. పూజాకార్యక్రమాల అనంతరం

ZEE5 హెడ్స్‌, తమడ మీడియా ప్రతినిధులు మాట్లాడుతూ.. ఈ వెబ్‌ సిరీస్‌ను రాజమండ్రి, పరిసర ప్రాంతాలలో 15 రోజుల పాటు షూటింగ్‌ జరుపుకుంటుంది. రాజ్‌తరుణ్‌ తొలిసారిగా వెబ్‌సిరీస్‌లో నటించడం వెబ్‌సిరీస్‌లకు ప్రజల్లో ఉన్న ఆదరణకు నిదర్శనం.ఈ మధ్య కాలంలో అన్ని బాషల్లోని హీరోలు సైతం ఈ వెబ్ సిరీస్ లలో నటించడానికి ఆసక్తిని కనపరుస్తున్నారు.మొన్న నటుడు సుశాంత్ మంచి కంటెంట్ ఉన్న వెబ్ సీరీస్ లో నటించడానికి ముందుకు రాగా..ఇప్పుడు రాజ్ తరుణ్ ముందుకు రావడం చాలా సంతోషంగా ఉంది. ఈ ZEE5 ఒరిజినల్ వెబ్ సిరీస్ లో ప్రేమలోని కొత్త కోణాన్ని ఆవిష్కరించే సరికొత్త ప్రేమ కథ ఇది. అందరినీ అలరించేలా ఉంటుంది. కామెడీ డ్రామా, రొమాన్స్‌లతో సాగే ఈ వెబ్‌ సిరీస్‌ 30 నిముషాల నిడివితో 8 ఎపిసోడ్స్‌ ప్రసారం అవుతాయి అన్నారు.

దర్శకుడు సంజీవ్‌రెడ్డి మాట్లాడుతూ..పెళ్లి రోజున తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి పెళ్లి కూతురు లేచిపోతుంది. చేతిలో మంగళ సూత్రం పట్టుకుని ఆమె కోసం మండపంలో పెళ్లి కొడుకు ఎదురు చూస్తూ ఉంటాడు. ఎన్నో ఏళ్లుగా పెళ్లి కోసం ఎదురు చూస్తున్న ఆ అబ్బాయి… తన జీవితంలో ముఖ్యమైన రోజున అలా జరుగుతుందని ఊహించని ఆ పెళ్లి కొడుకు, అందుకు కారణమైన అమ్మాయి – అబ్బాయి పై ఎలాంటి ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటాడు.ఆ తర్వాత ఏమైంది? అనేది వెబ్ సిరీస్ లో చూడాలి.ZEE5 వంటి పెద్ద సంస్థ లో ఈ వెబ్ సిరీస్ సిరీస్ చేసే అవకాశం కల్పించిన ZEE5 & తమడ మీడియా వారికి ప్రత్యేక ధన్యయూవాదాలు అన్నారు.

ఆర్ఆర్ఆర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘బాహుబలి’ కి ఉన్న ఈ 10 అడ్వాంటేజ్ లు ‘ఆర్.ఆర్.ఆర్’ కు లేవట..!
‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ గురించి ఈ 11 ఇంట్రెస్టింగ్ విషయాలు మీకు తెలుసా?
‘పుష్ప’ తో పాటు బుల్లితెర పై రికార్డ్ టి.ఆర్.పి లు నమోదు చేసిన 10 సినిమాల లిస్ట్…?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus