దేశం గర్వించదగ్గ దర్శకుడిగా ఎదిగిన ఎస్.ఎస్.రాజమౌళి తాజాగా చేసిన ఎమోషనల్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. కెరీర్ ప్రారంభంలో ఆయన అనుభవించిన సందర్భాలను రాజమౌళి తెలియజేసాడు. ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రం ప్రమోషనల్లో భాగంగా ఆయన మాట్లాడుతూ… “ఒకానొక టైములో నాకు సంపాదన అనేది లేదు. నా భార్య జీతం మీదే బ్రతికాను. నేను చిన్నప్పుడు సరిగ్గా చదువుకోలేదు. నాకు తెలిసిందంతా ఒక్కటే సినిమా. నా తండ్రి రిఫరెన్స్ తో సినిమా రంగంలోకి అడుగుపెట్టాడు.
ఓ దర్శకుడికి అన్ని క్రాఫ్ట్స్ పై అవగాహన ఉండాలని మా నాన్నగారు చెబుతుండేవారు. అందుకే కసితో నేను అన్ని క్రాఫ్ట్స్ లో పనిచేసాను. ఇక్కడ అవకాశం రావాలి అంటే సక్సెస్ కావాలి. కానీ సక్సెస్ అవ్వాలి అంటే మొదట అవకాశం కూడా రావాలి కదా. ఇవి ఆలోచిస్తూనే రోజులు గడిచిపోయాయి. ఎంత కసి ఉన్నా.. సంపాదన లేదు అనే విషయం నాలో ఉన్న విశ్వాసాన్ని దెబ్బకొట్టేది. కొన్నాళ్ళ పాటు నాకు సంపాదన లేదు. నా భార్యే నన్ను పోషించింది. ఈ మాట చెప్పడానికి నేను సిగ్గుపడడం లేదు.
సంతోషంగానే ఉంది. నేను డైరెక్టర్ ని కాకముందు రోజూ నా పని ఒక్కటే..! పొద్దున్నే నా భార్య రమని ఆఫీస్‌లో డ్రాప్ చేసి… కధలు, డైలాగ్స్ రాసుకోవడం, మళ్ళీ సాయంత్రం ఆమెను ఇంటికి తీసుకురావడం. ఇది మా లవ్‌స్టోరీ. భవిష్యత్తులో నాకు ఫ్లాపులు వచ్చి సినిమాలు లేకపోతే ఆమెని జాబ్‌కి పంపిస్తా.నిజమైన ప్రేమ నా భార్యను చూసిన తర్వాతే కలిగింది” అంటూ రాజమౌళి చెప్పుకొచ్చాడు.