ఎన్టీఆర్- రాంచరణ్ లు హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రం రిలీజ్ అయ్యి.. 3 వారాలు పూర్తి కావస్తున్నా కలెక్షన్లు మాత్రం ఇంకా తగ్గడం లేదు. 4 ఏళ్ళుగా ప్రేక్షకులు ఈ మూవీ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు. 2018 చివర్లో ఈ మూవీ షూటింగ్ ప్రారంభమైంది. ఈ మూవీలో కొమురం భీంగా యంగ్ టైగర్ ఎన్టీఆర్, అల్లూరి సీతారామారాజుగా మెగా పవర్ స్టార్ రాంచరణ్ నటించారు. అయితే సినిమా రిలీజ్ అయ్యాకా చాలా మంది నోటి నుండీ ఒక్కటే మాట.
రాంచరణ్ ను ముందు ఎన్టీఆర్ ను తక్కువ చేసి చూపించారు అని. ముఖ్యంగా ఎన్టీఆర్ అభిమానులు ఈ విషయంలో బాగా హర్ట్ అయ్యారు. సోషల్ మీడియా వేదికగా ఈ విషయం పై ఎక్కువ డిస్కషన్లు జరిగాయి. ఈ క్రమంలో దర్శకుడు రాజమౌళిని ఎన్టీఆర్ అభిమానులు తిట్టిపోసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే ‘ఆర్.ఆర్.ఆర్’ సక్సెస్ సెలబ్రేషన్స్ లో భాగంగా దర్శకుడు రాజమౌళి ఈ విషయం పై క్లారిటీ ఇచ్చాడు.
రాజమౌళి మాట్లాడుతూ.. ” ‘ఆర్.ఆర్.ఆర్’ మూవీలో ఎవరి డామినేషన్ లేదు. తారక్, చరణ్.. ఇద్దరూ కూడా తమ బెస్ట్ ఇచ్చారు. ‘ఎన్టీఆర్ పై చరణ్ డామినేషన్ ఎక్కువగా ఉంది అనే మాట సరైనది కాదు. ఏదైనా మనం చూసే దృష్టిలోనే ఉంటుంది. క్లైమాక్స్‌లో రాంచరణ్ కు ఎక్కువ స్క్రీన్ స్పేస్ ఉండడం వల్ల.. అది చూసి బయటికి వచ్చే ప్రేక్షకులకు చరణ్ డామినేషన్ ఉందినిపించవచ్చు. అదే కనుక కొమురం భీముడో పాట దగ్గరే క్లైమాక్స్ ఉండుంటే అప్పుడు ఎన్‌టీఆర్ డామినేషన్ ఎక్కువ అని ఫీలయ్యేవారు’ అంటూ జక్కన చెప్పుకొచ్చాడు.
ఇదే విషయం పై చరణ్ కూడా ఓ సందర్భంలో చెప్పుకొచ్చాడు. తారక్ అద్భుతంగా నటించాడని.. అతను తప్ప ఆ పాత్రని ఎవ్వరూ చేయలేరు అంటూ చెప్పుకొచ్చాడు. ఎన్టీఆర్ కూడా రాజమౌళి ఇద్దరినీ సమానంగా చూపించాడు అంటూ చెప్పుకొచ్చాడు. ఈ ముగ్గురు క్లారిటీ ఇచ్చినా ఈ గుసగుసలు ఇంకా ఆగడం లేదు.
Most Recommended Video
‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
‘ప్రతిఘటన’ తో గోపీచంద్ తండ్రి టి.కృష్ణ దర్శకత్వం వహించిన సినిమాల లిస్ట్..!
5 ఏళ్ళ కెరీర్ లో రష్మిక మందన మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!