Rajamouli: ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ ప్రెస్టీజియస్‌ అవార్డు అందుకున్న రాజమౌళి!

‘ఆర్ఆర్ఆర్‌’ – ‘ఆస్కార్‌’… గత కొన్ని రోజులుగా ఈ చర్చే నడుస్తోంది. ఇటీవల కాస్త నెమ్మదించిన ఈ చర్చ.. మళ్లీ ఇప్పుడు ఊపందుకుంది. కారణం రాజమౌళికి ఓ ప్రతిష్ఠాత్మక క్రిటిక్‌ అవార్డు రావడమే. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమాకుగాను న్యూయార్క్ ఫిల్మ్ క్రిటిక్స్ సర్కిల్ (NYFC) పురస్కారం అందుకున్నారు. దీంతో ఇలాంటి దర్శకుడు తీసిన సినిమాను ఆస్కార్‌ బరిలో మన దేశం నుండి ఎందుకు దింపలేదు అంటూ చర్చ ప్రారంభించారు నెటిజన్లు. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమాకు గాను రాజమౌళి అవార్డు వచ్చింది

అంటూ NYFC ట్విటర్‌లో పేజీలో చేసిన ట్వీట్‌ కింద చూస్తే.. ఇదే చర్చ కనిపిస్తోంది. మాస్టర్ పీస్ సినిమాను తెరకెక్కించిన రాజమౌళికి బెస్ట్‌ డైరక్టర్‌గా ఆ అవార్డు రావడంతో ఆయన అభిమానులు… తారక్‌, చరణ్‌ అభిమానులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పనిలోపనిగా ఇలాంటి వ్యక్తి తీసిన సినిమా ఆస్కార్‌కి పంకకపోవడం సరికాదు అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. ఇంకొందరు అయితే ఆస్కార్‌ రేసులో రాజమౌళి ఓ అడుగు ముందుకేశారు అని కూడా అంటున్నారు. ఆస్కార్‌ పురస్కారాల ప్రధానానికి ముందు అమెరికాలో ఇలాంటి పురస్కారోత్సవాలు జరుగుతూ ఉంటాయి.

అందులో పురస్కారాలు అందుకున్న వారికి.. ఆస్కార్‌ పురస్కారం అవకాశం ఎక్కువ అనే మాట కూడా వినిపిస్తూ ఉంటుంది. దీంతో ‘ఆర్‌ఆర్ఆర్‌’కి కనీసం ఓ ఆస్కార్‌ అయినా వస్తుంది అంటూ అంచనా వేస్తున్నారు. మరి ఈ చిత్రం విషయంలో ఏం జరగనుందో కాలమే నిర్ణయిస్తుంది. మరోవైపు ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ టీమ్‌ ఆస్కార్‌ రేసులో బలంగా ఉండటానికి అన్ని రకాల చర్యలూ చేపడుతోంది. ఆస్కార్‌ బరిలో నిలిచే సినిమాలకు కంటెంట్‌ ఎంత ముఖ్యమో, ప్రచారమూ అంతే ముఖ్యం అంటారు.

ఆస్కార్‌ ప్రతినిధులు, టీమ్‌కి ఆ సినిమా గురించి స్పష్టంగా తెలిసేలా.. అక్కడ ప్రత్యేక షోలు వేయాలి. సినిమా కాన్సెప్ట్‌ను వివరంగా వారికి తెలియజేయాలి అంటారు. దాంతోపాటు సినిమాకు రెగ్యులర్‌ ప్రమోషన్‌ ఆస్కార్‌కి ముందు ఉండాల్సిందే అని కూడా చెబుతుంటారు. అలాగే ఇలాంటి అవార్డులు కూడా వస్తే ఇంకా బెటర్‌. ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి.. మెయిన్‌ ఈవెంట్‌లోనూ సినిమాకు పురస్కార సరదా దొరుకుతుందేమో చూడాలి.

హిట్2 సినిమా రివ్యూ& రేటింగ్!
మట్టి కుస్తీ సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
డీజే టిల్లు టు మసూద ఈ ఏడాది ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి హిట్టు కొట్టిన సినిమాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus