ప్రభాస్ హీరో గా నటిస్తున్న సినిమాలలో అభిమానుల్లో భారీ స్థాయి అంచనాలను ఏర్పాటు చేసుకున్న చిత్రం ‘కల్కి 2898 AD’. ఈ సినిమా పై అభిమానుల్లోనే కాదు, ప్రేక్షకుల్లో కూడా అంచనాలు మామూలు రేంజ్ లో లేవు. ఎందుకంటే ఇది టైం ట్రావెల్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన సినిమా కాబట్టి. మన టాలీవుడ్ సూపర్ హీరో సినిమాలు ఇప్పటి వరకు రాలేదు. కాబట్టి ఈ చిత్రం కచ్చితంగా ఇక్కడ వండర్స్ సృష్టిస్తుందని బలంగా నమ్ముతున్నారు ట్రేడ్ పండితులు.
ఇకపోతే ఈ చిత్రం లో ఇప్పటికే కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ , దీపికా పదుకొనే, దుల్కర్ సల్మాన్ ఇలా ఎంతో మంది సూపర్ స్టార్స్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. కేవలం వీళ్ళ రెమ్యూనరేషన్స్ ని పరిగణలోకి తీసుకుంటూనే 300 కోట్ల రూపాయిల బడ్జెట్ అవుతుంది. ఇక ప్రొడక్షన్ కాస్ట్ కూడా లెక్కలోకి తీసుకొంటే 600 కోట్ల రూపాయిల బడ్జెట్ అవుతుందని అంచనా. 600 కోట్ల రూపాయిలు అంటే బాహుబలికి మూడింతల బడ్జెట్ అన్నమాట.
ప్రభాస్ మరియు ప్రధాన తారాగణం మీద నిర్మాత అశ్వినీదత్ కి అంత నమ్మకం అన్నమాట. అయితే ఈ సినిమాలో దర్శక ధీరుడు రాజమౌళి ఒక ముఖ్య పాత్ర పోషించబోతున్నాడు. ఆయన పాత్ర ఈ సినిమాలో 5 నిముషాలు ఉంటుంది. కేవలం ఈ 5 నిమిషాల సన్నివేశం కోసం ఆయన 10 కోట్ల రూపాయిల రెమ్యూనరేషన్ ని తీసుకుంటున్నాడట. (Rajamouli) రాజమౌళి కి ఇది కొత్తేమి కాదు, గతం లో కూడా ఆయన చాలా సినిమాల్లో నటించాడు.
అప్పుడు కేవలం తెలుగు స్టార్ డైరెక్టర్ మాత్రమే , ఇప్పుడు ఆయన పాన్ వరల్డ్ డైరెక్టర్, కాబట్టి రెమ్యూనరేషన్ కూడా అదే స్థాయిలో ఫిక్స్ చేసారు. ఇంతకు ముందు ఉచితంగానే రాజమౌళి సినిమాల్లో నటించడానికి ఒప్పుకునే వాడు, కానీ ఇప్పుడు మాత్రం ఆయన డబ్బులు గట్టిగానే డిమాండ్ చేస్తున్నాడు.
మిడ్ రేంజ్ హీరోలు చేసిన ఈ 10 యాక్షన్ సినిమాలు భారీ నష్టాలు మిగిల్చాయని మీకు తెలుసా?
మెహర్ రమేష్ తో పాటు పెద్ద హీరోలు ఛాన్సులు ఇచ్చినా హిట్లివ్వలేకపోయిన డైరెక్టర్ల లిస్ట్.!
రామ్ నీ బాలయ్య ఏమని తిట్టాడో తెలిస్తే షాక్ అవుతారు..!