“2,3 సంవత్సరాల క్రితం ‘ధూమ్ -2’ (Dhoom 2) హిందీలో రిలీజ్ అయినప్పుడు.. ‘వాళ్ళకే అంత క్వాలిటీ ఎందుకు వస్తుంది. హృతిక్ రోషన్ లా (Hrithik Roshan) మనకి హీరోలు లేరా? అలాంటి హీరోలతో మనం సినిమాలు చేయలేమా.? అలా మనం ఎందుకు తీయలేకపోతున్నాం? అని చాలా ఉండేది. అయితే 2 రోజుల క్రితం మెహర్ రమేష్… ‘బిల్లా’ సినిమాలోని ఒక సాంగ్ చూపించారు, బిల్లా (Billa) పోస్టర్స్ డిజైన్ చూపించారు, ఇప్పుడు ట్రైలర్ చూశాం. ఒక్కటే మాట.. ‘హృతిక్ రోషన్ ఎందుకు పనిచేయడు’.
తెలుగు సినిమాని బాలీవుడ్ లెవెల్ దాటి హాలీవుడ్ లెవల్లో నిలబెట్టిన మెహర్ రమేష్ (Meher Ramesh) గారికి స్పెషల్ థాంక్స్” అంటూ గతంలో రాజమౌళి (S. S. Rajamouli) ‘బిల్లా’ సినిమా ట్రైలర్ లాంచ్ లో పలికిన మాటలు ఇవి. బాలీవుడ్ తో పోలిస్తే.. తెలుగు సినిమా ఏమాత్రం తక్కువ కాదు అనే అర్థం వచ్చేలా రాజమౌళి చెప్పిన మాటలు ఇవి. ‘బిల్లా’ చూడటానికి చాలా స్టైలిష్ గా ఉంటుంది. సినిమా మొత్తం రిచ్ లుక్ ఉంటుంది. పాటలు కూడా చాలా లావిష్ గా చిత్రీకరించారు. అప్పట్లో థియేటర్లలో అండర్ పెర్ఫార్మ్ చేసింది ‘బిల్లా’.
బాక్సాఫీస్ వద్ద బ్రేక్ ఈవెన్ సాధించినా… సినిమాకి దక్కాల్సిన గౌరవం దక్కలేదు. దర్శకుడు మెహర్ రమేష్ కి కూడా ఎటువంటి అప్రిసియేషన్ లభించలేదు. అయితే తర్వాత ఈ సినిమాని టీవీల్లో బాగా చూశారు. ఇప్పుడు కూడా ‘బిల్లా’ కొత్తగా అనిపిస్తుంది. చాలా మంది ‘బిల్లా’ బాగుంటుంది అని చెబుతారు. కానీ రాజమౌళి మాత్రం అప్పట్లోనే ‘బిల్లా’ ని మెచ్చుకొని ఆకాశానికెత్తేశారు. ప్రభాస్ లాంటి కటౌట్ ని పాన్ వరల్డ్ లెవెల్లో ఎలా వాడుకోవచ్చో.. ఆయనకు అర్థమయ్యేలా చేసిన సినిమా ‘బిల్లా’ అనడంలో సందేహం లేదు.
హృతిక్ రోషన్ ఎందుకూ పనిచేయడు : రాజమౌళి
ప్రభాస్ పొటెన్షియల్ ఏంటనేది రాజమౌళి ముందే గుర్తించారు #16YearsForBilla #Billa #16YearsOfBilla #Prabhas #Rajamouli #MeharRamesh pic.twitter.com/YxeDjzLGUu
— Phani Kumar (@phanikumar2809) April 3, 2025