మెహర్ రమేష్ (Meher Ramesh) దర్శకత్వం వహించిన సినిమాలు అంటే సోషల్ మీడియా బ్యాచ్ చిన్న చూపు చూస్తారు. అఫ్ కోర్స్.. ఆయన కెరీర్లో ‘శక్తి’ (Sakthi) ‘షాడో’ (Shadow) ‘భోళా శంకర్’ (Bhola Shankar) వంటి సినిమాలు పెద్ద డిజాస్టర్లు అయ్యాయి. కానీ ఆయన దర్శకత్వంలో రూపొందిన మొదటి రెండు సినిమాలు అయిన ‘కంత్రి’ (Kantri) ‘బిల్లా’ (Billa) వంటివి క్లీన్ హిట్స్ గా నిలిచాయి అని చాలా మందికి తెలీదు. ముఖ్యంగా ‘బిల్లా’ సినిమాకి కల్ట్ ఫ్యాన్స్ ఉన్నారు.
కానీ థియేటర్స్ లో ఈ సినిమా అండర్ పెర్ఫార్మన్స్ మాత్రమే చేసింది అని భావించేవారు ఎక్కువ. ప్రభాస్ (Prabhas), అనుష్క (Anushka Shetty) కాంబినేషన్లో రూపొందిన ఈ సినిమా 2009 ఏప్రిల్ 03 న రిలీజ్ అయ్యింది. నేటితో ఈ సినిమా రిలీజ్ అయ్యి 16 ఏళ్ళు పూర్తి కావస్తోంది. ఈ సందర్భంగా ‘బిల్లా’ క్లోజింగ్ కలెక్షన్స్ ని గమనిస్తే :
నైజాం | 6.50 cr |
సీడెడ్ | 2.50 cr |
ఉత్తరాంధ్ర | 1.50 cr |
ఈస్ట్ | 0.90 cr |
వెస్ట్ | 1.00 cr |
గుంటూరు | 1.42 cr |
కృష్ణా | 1.02 cr |
నెల్లూరు | 0.70 cr |
ఏపీ + తెలంగాణ (టోటల్) | 15.54 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ | 0.50 cr |
టోటల్ వరల్డ్ వైడ్ | 16.04 cr |
‘బిల్లా’ (Billa) సినిమా రూ.16 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగింది. ఫుల్ రన్లో ఈ సినిమా రూ.16.04 కోట్ల షేర్ ను రాబట్టింది. ఓవరాల్ గా బ్రేక్ ఈవెన్ సాధించి క్లీన్ హిట్ గా నిలిచింది. అయితే రెస్ట్ ఆఫ్ ఇండియా వంటి ఏరియాల్లో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కాలేదు. తెలుగు రాష్ట్రాల్లో సమ్మర్ హాలిడేస్ వంటివి కలిసొచ్చి బ్రేక్ ఈవెన్ సాధించింది.ఆ టైంలో రవితేజ (Ravi Teja) ‘కిక్’ (Kick) సినిమా డామినేషన్ లేకపోతే.. ఈ సినిమా మరింతగా కలెక్ట్ చేసి ఉండేది.