Rajamouli, Jr NTR: ఎన్టీఆర్ ను కుంటి గుర్రంతో పోల్చిన రాజమౌళి.. ట్రోల్ చేస్తున్న ఫాన్స్?

టాలీవుడ్ ఇండస్ట్రీలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఎస్ ఎస్ రాజమౌళి మధ్య ఎలాంటి అనుబంధం ఉందో మనకు తెలిసిందే. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన స్టూడెంట్ నెంబర్ వన్, సింహాద్రి, యమదొంగ, RRR బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి విజయాలను అందుకున్నాయో మనకు తెలిసిందే. ఈ క్రమంలోని వీరిద్దరి మధ్య ఎంతో మంచి సన్నిహిత్యం ఉంది. అయితే వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన మొట్టమొదటి చిత్రం స్టూడెంట్ నెంబర్ వన్.ఈ సినిమా షూటింగ్ సమయంలో రాజమౌళి ఎన్టీఆర్ గురించి చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

రాజమౌళి దర్శకుడిగా స్టూడెంట్ నెంబర్ వన్ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. ఈ సినిమాని శ్రీ వైజయంతి మూవీస్ బ్యానర్ లో అశ్వినీ దత్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఇకపోతే ఈ సినిమాలో ముందుగా ప్రభాస్ ను హీరోగా అనుకున్నారు.ఈ విషయం తెలిసిన హరికృష్ణ అశ్విని దత్ కు ఫోన్ చేసి ఎన్టీఆర్ పేరును సూచించడంతో ఆయన మాట కాదనలేక ప్రభాస్ స్థానంలో ఎన్టీఆర్ నటించినట్లు తాజాగా నిర్మాత అశ్వినీ దత్ ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు.

ఇక ఈ సినిమాలో ప్రభాస్ కి బదులు ఎన్టీఆర్ హీరోగా అని చెప్పడంతో ఎన్టీఆర్ పట్ల రాజమౌళి చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.ఇదేంటి నా మొదటి సినిమాకి ఇలాంటి హీరో దొరికారు ఇది నా కర్మ అనుకున్నానని రాజమౌళి భావించినట్లు తెలిపారు. ఎన్టీఆర్ తో తన సినిమా అంటేనే కుంటి గుర్రంతో రేసు మొదలు పెట్టానని భావించాను. అయినా కుంటి గుర్రంతో రేసులో నెగ్గితే ఆ మజానే వేరే ఉంటుందనే మెంటాలిటీ తో ఈ సినిమా చేశానని తెలిపారు.

హీరో అందంగా లేకపోయినా మనం సినిమాని అందంగా చేస్తే మనకు మంచి పేరు వస్తుందన్న ఉద్దేశంతో ఈ సినిమాని చేశానని అయితే ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయం అందుకుంది అంటూ రాజమౌళి గతంలో చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఈ విషయంపై ఎన్టీఆర్ అభిమానులు రాజమౌళి పై ఎంతో కోపం వ్యక్తం చేయడమే కాకుండా అప్పటి కుంటి గుర్రమే ఇప్పుడు పాన్ ఇండియా హీరో అయింది అంటూ పెద్ద ఎత్తున రాజమౌళిని ట్రోల్ చేస్తున్నారు.

‘సీతా రామం’ చిత్రానికి సంబంధించి బెస్ట్ డైలాగ్స్..!

Most Recommended Video

తరుణ్,ఎన్టీఆర్ టు కళ్యాణ్ రామ్.. సినిమాల్లో చనిపోయే పాత్రలు చేసిన స్టార్లు..!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus