SSMB28.. అనుకున్న టైంకి పూర్తవుతుందా..?

  • February 22, 2023 / 03:46 PM IST

‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో రాజమౌళి క్రేజ్ ఎంతగా పెరిగిందో తెలిసిందే. ఇంటర్నేషనల్ లెవెల్ లో ఆయనకి పాపులారిటీ వచ్చింది. రాజమౌళి ఒక్కో సినిమాకి రెండు, మూడేళ్ల సమయం తీసుకుంటారు. ప్రతి ఫ్రేమ్ పెర్ఫెక్ట్ గా ఉండేలా చూసుకుంటారాయన. కచ్చితంగా ఆయన సినిమాలు భారీ విజయాలను అందుకుంటాయి. అందుకే హీరోలు కూడా ఏళ్లకు ఏళ్లు కాల్షీట్స్ ను రాజమౌళికి ఇస్తుంటారు. ఇప్పుడు మహేష్ బాబు కూడా తన డైరీని జక్కన్న చేతిలో పెట్టేశారు.

రాజమౌళి సినిమా కోసం పూర్తి సమయాన్ని కేటాయించబోతున్నారు మహేష్ బాబు. అందుకే వీలైనంత త్వరగా త్రివిక్రమ్ సినిమాను పూర్తి చేసే పనిలో పడ్డారు. మహేష్ బాబు సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ పనులు మొదలుపెట్టేసి ఫినిషింగ్ స్టేజ్ కి తీసుకొచ్చే పనిలో ఉన్నారు రాజమౌళి. తండ్రితో కలిసి యాక్షన్ ఎడ్వెంచర్ కథ సిద్ధం చేస్తున్నారు. ఇందులో యాక్షన్ ఎపిసోడ్స్ పై ఇప్పటికే వర్క్ స్టార్ట్ చేశారట. తను పూర్తి స్క్రిప్ట్ తో వచ్చేలోపు SSMB28 షూటింగ్ పూర్తి చేయాలని మహేష్ బాబుకి ఓ డెడ్ లైన్ పెట్టారట రాజమౌళి.

తాజాగా ఓ షెడ్యూల్ పూర్తి చేసిన మహేష్ బాబు, త్రివిక్రమ్.. ఈ నెలాఖరు నుంచి మరో భారీ షెడ్యూల్ ప్లాన్ చేసుకుంటున్నారు. షూటింగ్ పూర్తయిన వెంటనే కొత్త లుక్ కోసం మహేష్ బాబుకి రెండు నెలల సమయం ఇవ్వబోతున్నారు రాజమౌళి. జక్కన్న సినిమా కోసం కొత్త ఓ కొత్త లుక్ ను ట్రై చేసే ఆలోచనలో ఉన్నారు మహేష్ బాబు. ఈసారి మరింత హ్యాండ్సమ్ గా కనిపించడానికి ప్లాన్ చేస్తున్నారు.

ఈ సినిమాను ఏడాది చివర్లో సెట్స్ పైకి తీసుకెళ్లే ఛాన్స్ ఉంది. వచ్చే ఏడాది కల్లా షూటింగ్ పూర్తి చేయాలనేది ప్లాన్. కానీ రాజమౌళి సినిమాలు అంత ఈజీగా పూర్తికావు. కనీసం రెండేళ్ల సమయం పడడం ఖాయం.

సార్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గజిని’ మూవీ మిస్ చేసుకున్న హీరోలు ఎవరంటే?

టాప్ 10 రెమ్యూనరేషన్ తెలుగు హీరోలు…ఎంతో తెలుసా ?
కళ్యాణ్ రామ్ నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus