అభిమానులకు గూజ్ బంప్స్ తెప్పించే అప్డేట్ ఇచ్చిన రాజమౌళి తండ్రి

  • March 14, 2023 / 01:19 PM IST

ఆర్.ఆర్.ఆర్ కి ఆస్కార్ వచ్చింది. అంటే మొదటిసారి తెలుగు సినిమాకి ఆస్కార్ అవార్డు లభించింది. 90 ఏళ్ళ సినీ చరిత్రలో ఎన్నడూ చూడని, వినని అద్భుతం ఇది. అందుకే దేశం మొత్తం పండుగ చేసుకుంటుంది. 95వ ఆస్కార్‌ అవార్డుల ప్రధానోత్సవ వేడుకల్లో ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంలోని ‘నాటునాటు’ పాటకు ప్రతిష్టాత్మక ఆస్కార్‌ అవార్డ్ లభించింది.ఈ పాటను ఎం.ఎం కీరవాణి తనయుడు కాలభైరవ అలాగే బిగ్ బాస్3 విన్నర్ అయిన రాహుల్ సిప్లిగంజ్ కలిసి పాడారు.

చంద్రబోస్ లిరిక్స్ అందించగా.. ప్రేమ్ రక్షిత్ సినిమాటోగ్రఫీ అందించారు. ఈ పాటలో ఎన్టీఆర్, రాంచరణ్ వేసిన స్టెప్పులు… థియేటర్లలో జనాలతో నాన్ స్టాప్ గా విజిల్స్ కొట్టిస్తూనే ఉన్నాయని చెప్పాలి. ఒక్క తెలుగు ప్రేక్షకులే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులు కూడా ‘నాటు నాటు’ పాటను ఓన్ చేసుకున్నారని ఈరోజు ప్రూవ్ అయ్యింది. అయితే రామ్- భీమ్ లను మళ్ళీ మనం బిగ్ స్క్రీన్ పై చూడొచ్చట. అంటే మళ్ళీ ఆ సినిమా రీ- రిలీజ్ అవుతుందని కాదు..!

‘ఆర్.ఆర్.ఆర్ 2’ కూడా ఉంటుందట. ఈ విషయాన్ని స్వయంగా రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ చెప్పుకొచ్చారు. ‘ ‘ఆర్.ఆర్.ఆర్’ కి కొనసాగింపుగా ‘ఆర్.ఆర్.ఆర్ 2’ కూడా ఉంటుంది. అది ‘ఆర్.ఆర్.ఆర్’ ను మించి ఉంటుంది. రాంచరణ్ – ఎన్టీఆర్ లే ఈ సీక్వెల్ లో నటిస్తారు. త్వరలో దీని గురించి మరిన్ని వివరాలు తెలియజేస్తాను ‘ అంటూ ఆయన చెప్పుకొచ్చారు.

రెమ్యూనరేషన్ విషయంలో తగ్గేదే లే అంటున్న టాప్ 10 తెలుగు దర్శకులు!
విదేశాల్లో ఎక్కువగా కలెక్ట్ చేసిన 10 ఇండియన్ సినిమాలు!

2023 టాప్ 10 తెలుగు హీరోయిన్లు వాళ్ళ రెమ్యూనరేషన్స్.!
మనోజ్ టు అభిరామ్.. పెద్దోళ్ల సపోర్ట్ కు దూరంగా ఉన్న వారసుల లిస్ట్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus