దర్శకుడిగా రాజమౌళి సూపర్ సక్సెస్. ఆయనకి ఇంత వరకు అపజయం పరిచయం కాలేదు. ఇప్పటి వరకు ఆయన తెరకెక్కించిన 11 చిత్రాలలో అన్ని బ్లాక్ బస్టర్స్ లేదా ఇండస్ట్రీ హిట్స్ లిస్ట్ లో ఉన్నాయి. మరి ఆయన సక్సెస్ లో తండ్రి విజయేంద్ర ప్రసాద్ భాగంగా కూడా ఉంది. రాజమౌళి సినిమాలకు కథలు అందించేది విజయేంద్ర ప్రసాదే. ఇక ఇండియాలోనే అత్యధిక వసూళ్లు సాధించిన బాహుబలి మూవీ కథా రచయిత విజయేంద్ర ప్రసాద్ కావడం విశేషం.
ఇక ప్రస్తుతం రాజమౌళి తెరకెక్కిస్తున్న మరో పాన్ ఇండియా ప్రాజెక్ట్ ఆర్ ఆర్ ఆర్ కి కూడా కథను విజయేంద్ర ప్రసాద్ సమకూర్చారు. ఇతర పరిశ్రమలలో కూడా భారీ విజయాలు అందుకున్న భజరంగీ భాయ్ జాన్, మెర్సల్ వంటి చిత్రాలకు విజయేంద్ర ప్రసాద్ రచయితగా పని చేశారు. ఐతే దర్శకుడిగా మాత్రం విజయేంద్ర ప్రసాద్ విజయం సాధించలేకపోయారు. దర్శకుడిగా విజయేంద్ర ప్రసాద్ మొదటి చిత్రం అర్థా0గి. ఆ మూవీ పాజిటివ్ టాక్ తెచ్చుకున్నా కమర్షియల్ గా విజయం సాధించలేదు. ఇక 2006లో శ్రీకృష్ణ 2006 అనే కామెడీ రొమాంటిక్ డ్రామా తెరకెక్కించారు.
ఆ సినిమా అట్టర్ ప్లాప్ అయ్యింది. ఆ సినిమా ఫలితం తరువాత ఐదేళ్లు గ్యాప్ తీసుకున్న ఆయన 2011 నాగార్జున హీరోగా పీరియడ్ డ్రామా రాజన్న మూవీ చేశారు. భారీ అంచనాల మధ్య వచ్చిన ఆ మూవీ కూడా సరైన విజయం అందుకోలేదు. 2017లో ఆయన చేసిన శ్రీవల్లి సైతం ఘోరంగా ఫెయిల్ అయ్యింది. రచయితగా ఇండస్ట్రీ హిట్స్ అందుకున్న విజయేంద్ర ప్రసాద్ డైరెక్టర్ అట్టర్ ప్లాప్ అయ్యారు. త్వరలో మళ్ళీ ఆయన డైరెక్టర్ గా మారనున్నాడని టాక్ వినిపిస్తుంది.
Most Recommended Video
ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన 12 సినిమాలు!
తెలుగు హీరోలను చేసుకున్న తెలుగురాని హీరోయిన్స్
అందమైన హీరోయిన్స్ ని పెళ్లి చేసుకున్న టాలీవుడ్ విలన్స్