Rajamouli: ఆ మూవీ సక్సెస్ భయపెట్టిందని చెప్పిన రాజమౌళి!

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రేక్షకులకు నచ్చే అన్ని అంశాలతో సినిమా తెరకెక్కించి తన సినిమా కమర్షియల్ గా కూడా సక్సెస్ సాధించేలా జాగ్రత్తలు తీసుకుంటారు. ఒక సందర్భంలో మగధీర సినిమా రిలీజ్ సమయంలో చాలా టెన్షన్ పడ్డానని ఆయన చెప్పుకొచ్చారు. మగధీర సినిమా రిలీజై హిట్టవ్వకపోతే పరిస్థితి ఏంటని భయం పట్టుకుందని రాజమౌళి పేర్కొన్నారు. రమా రాజమౌళి గురించి జక్కన్న మాట్లాడుతూ ఇంటికి వచ్చి చూస్తే తను స్టైలిష్టా అని అనుకుంటారని రాజమౌళి కామెంట్ చేశారు.

రమ ఇంట్లో తన పనులు తాను చేసుకుంటుందని జక్కన్న అన్నారు. ఇంటిని శుభ్రంగా ఉంచడం రమకు చాలా ఇష్టమని జక్కన్న అన్నారు. ఫ్రీ టైమ్ లో సోది మాట్లాడుకుంటామని జక్కన్న తెలిపారు. తిండి గురించి కూడా ఎక్కువగా ఆలోచిస్తామని జక్కన్న అన్నారు. నాకు కంఫర్ట్ ఉన్న టెక్నీషియన్లతో పని చేయడం ఇష్టమని అయితే ఆ టెక్నీషియన్లు నా కుటుంబంలోనే ఉన్నారని జక్కన్న వెల్లడించారు. నా సినిమాలలో నాకు బాగా నచ్చిన మూవీ విక్రమార్కుడు అని రాజమౌళి అన్నారు.

నాకు వంట రాదని రాజమౌళి కామెంట్లు చేశారు. జూనియర్ ఎన్టీఆర్ కోతి అని నితిన్ సాఫ్ట్ అని రామ్ చరణ్ వెల్ ట్రైన్డ్ అని జక్కన్న తెలిపారు. గజాల కిడ్ అని భూమిక ఫిలాసపర్ అని శ్రియ వెరీ ప్రొఫెషనల్ అని రాజమౌళి కామెంట్లు చేశారు. కాస్టూమ్స్ విషయంలో రమదే తుది నిర్ణయమని రాజమౌళి చెప్పుకొచ్చారు.

రాజమౌళి తర్వాత సినిమా మహేష్ బాబుతో తెరకెక్కుతుండగా జక్కన్న ఈ సినిమా స్క్రిప్ట్ కోసం ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నారు. జక్కన్న మహేష్ తో తెరకెక్కిస్తున్న తొలి సినిమా ఇదే కావడం గమనార్హం. ఈ సినిమాలో ఇతర భాషల నటీనటులకు కూడా ప్రాధాన్యత ఉండనుందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. సినిమాసినిమాకు జక్కన్న సినిమాల బడ్జెట్ అంతకంతకూ పెరుగుతోంది.

ఊర్వశివో రాక్షశివో సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

లైక్ షేర్ & సబ్స్క్రైబ్ సినిమా రివ్యూ & రేటింగ్!
బొమ్మ బ్లాక్ బస్టర్ సినిమా రివ్యూ & రేటింగ్!
శిల్పా శెట్టి టు హన్సిక.. వ్యాపారవేత్తలను పెళ్లి చేసుకున్న హీరోయిన్ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus