Rajamouli, Allu Arjun: అల్లు అర్జున్ తో సినిమాపై రాజమౌళి అలా అన్నారా?

రాజమౌళి అల్లు అర్జున్ కాంబినేషన్ లో సినిమా తెరకెక్కితే బాగుంటుందని అల్లు అర్జున్ అభిమానులు కోరుకుంటున్నారు. బన్నీ, రాజమౌళి దాదాపుగా ఒకే సమయంలో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చినా ఈ కాంబినేషన్ లో సినిమా మాత్రం రాలేదు. రాజమౌళి తర్వాత సినిమాలో హీరోగా మహేష్ బాబు ఫిక్స్ కావడంతో ఇప్పట్లో ఈ కాంబినేషన్ లో సినిమా తెరకెక్కే అవకాశాలు లేవని చెప్పవచ్చు. అయితే కొన్నిరోజుల క్రితం మహేష్ మూవీ తర్వాత బన్నీ జక్కన్న కాంబోలో మూవీ వస్తుందని వార్తలు వచ్చాయి.

Click Here To Watch NEW Trailer

వైరల్ అయిన వార్తల గురించి మీడియా మిత్రులు రాజమౌళిని వివరణ కోరగా ఆ వార్తలో నిజం లేదని జక్కన్న చెప్పారని సమాచారం. ఆర్ఆర్ఆర్ మూవీ రిలీజ్ తర్వాత మహేష్ మూవీపైనే జక్కన్న దృష్టి పెట్టనున్నారు. అడ్వెంచరస్ థ్రిల్లర్ గా ఈ సినిమా తెరకెక్కనుందని ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతుండటం గమనార్హం. అయితే ఇప్పుడు కాకపోయినా భవిష్యత్తులోనైనా బన్నీ రాజమౌళి కాంబోలో సినిమా వస్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

జక్కన్న తన సినీ కెరీర్ లో జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్ లతో ఎక్కువగా సినిమాలను తెరకెక్కించారు. ఆర్ఆర్ఆర్ సినిమాతో రాజమౌళి కెరీర్ బిగ్గెస్ట్ హిట్ ను సొంతం చేసుకుంటానని కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. తారక్, చరణ్ హీరోలుగా తెరకెక్కిన ఈ సినిమాకు రికార్డు స్థాయిలో బిజినెస్ జరిగిందని సమాచారం అందుతోంది. రిలీజ్ కు ముందే నిర్మాతకు ఈ సినిమాతో అంచనాలకు మించి లాభాలు వచ్చాయని బోగట్టా.

ఫుల్ రన్ లో ఆర్ఆర్ఆర్ ఏ స్థాయిలో కలెక్షన్లను సాధిస్తుందో చూడాల్సి ఉంది. ఎన్టీఆర్, చరణ్ ఈ సినిమాతో పాన్ ఇండియా హీరోలుగా తమకు గుర్తింపు దక్కుతుందని ఆశిస్తున్నారు. ఎన్టీఆర్, చరణ్ లకు ఈ సినిమాకు వేర్వేరుగా 45 కోట్ల రూపాయలకు అటూఇటుగా రెమ్యునరేషన్ దక్కిందని సమాచారం అందుతోంది. రాజమౌళి మాత్రం ఈ సినిమాకు వచ్చిన లాభాలలో 50 శాతం వాటాగా తీసుకున్నారని బోగట్టా.

రాధే శ్యామ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఒకే ఫ్యామిలీలో రెండు జెనెరేషన్స్ కు చెందిన హీరోలతో జోడీ కట్టిన భామల లిస్ట్..!
‘గాడ్ ఫాదర్’ తో పాటు టాలీవుడ్లో రీమేక్ కాబోతున్న 10 మలయాళం సినిమాలు..!
ఈ 10 సినిమాలు తెలుగులోకి డబ్ అయ్యాక కూడా రీమేక్ అయ్యాయని మీకు తెలుసా..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus