ఇదివరకు తెలుగువారికి పరిచయమైన దగ్గుబాటి రానా బాహుబలి చిత్రంతో దేశవ్యాప్తంగా గుర్తింపు సాధించుకున్నారు. ఆ క్రేజ్ ని రెట్టింపు చేసుకోవడానికి సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో ‘ఘాజీ’ సినిమా చేశారు. ఏకకాలంలో తెలుగు, తమిళ, హిందీ భాషల్లో దీనిని పీవీపీ వారు భారీ బడ్జెట్ తో నిర్మించారు. 1971 వ సంవత్సరంలో ఇండియా, పాకిస్తాన్ యుద్ధ కథాంశంతో సాగే ఈ సినిమాలో రానా నేవీ ఆఫీసర్ అర్జున్ గా నటించారు. ఆసక్తికర సంఘటనతో రూపుదిద్దుకున్న ఈ మూవీపై భారీ క్రేజ్ నెలకొని ఉంది. ప్రచారం కూడా అందుకు తగ్గట్టుగానే చేశారు. రెండు రోజుల ముందే సినీ ప్రముఖుల కోసం ఈ మూవీ ప్రివ్యూ షో వేశారు.
స్టార్స్ ఘాజీపై ప్రశంసల జల్లు కురిపించడంతో అందరిలో ఈ చిత్రాన్ని చూడాలనే ఆత్రుత పెరిగింది. అందుకే ఈ సినిమాను నేడు (శుక్రవారం) ప్రపంచవ్యాప్తంగా దాదాపు 3500 స్క్రీన్లలో ప్రదర్శించారు. స్క్రీన్స్ లిస్ట్ ని చూసిన దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి షాక్ తిన్నారంట. రానా మూవీకి ఇంత క్రేజ్ ఉందా? అంటూ ఆశ్చర్యపోయారని తెలిసింది. ఘాజీ మూవీ సూపర్ హిట్ కావడం తన బాహుబలి కంక్లూజన్ మూవీ ప్లస్ అవుతుందని సంబరపడుతున్నట్లు సమాచారం.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.