టాలీవుడ్ ఇండస్ట్రీలో మళ్ళీ సినిమాలతో పాత సందడి కనిపించాలని ప్రతీ ఒక్కరు చాలా బలంగా కోరుకున్నారు. ఇక మొత్తానికి అఖండ సినిమాతో మళ్ళీ అలాంటి వాతావరణం కనిపించింది. గతంలో ఎప్పుడు లేని విదంగా బాలకృష్ణ తన కెరీర్ లోనే భారీ స్థాయిలో ఓపెనింగ్స్ అందుకున్నాడు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన అఖండ బాక్సాఫీస్ వద్ద సాలీడ్ వసూళ్లను అందుకుంటోంది. ఇక అసలు మ్యాటర్ లోకి వస్తే సినిమాకు సంబంధించిన రిజల్ట్ పై చాలా మంది అభిప్రాయాలను బాలకృష్ణ నిజం చేశాడు.
ముఖ్యంగా రాజమౌళి కోరికను కూడా నెరవేర్చాడు. అఖండ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో దర్శకుడు రాజమౌళి అఖండ మంచి విజయం సాదించాలని కోరుకున్నారు. బాలయ్య ఒక ఆటమ్ బాంబ్ అంటూ ఇదే ఊపు థియేటర్స్ లో కనిపించాలని అభిమానుల అరుపులను ఉద్దేశిస్తు మాట్లాడారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఇండస్ట్రీ మళ్ళీ నిలదొక్కుకోవాల్సిన అవసరం ఉందని కేవలం అఖండకు మాత్రమే కాకుండా రాబోయే పెద్ద సినిమాలకు కూడా ఈ సినిమా విజయం మంచి నమ్మకాన్ని ఇస్తుందని రాజమౌళి వివరణ ఇచ్చారు.
ఏదేమైనా బాలకృష్ణ అఖండ సినిమా ద్వారా చాలామంది కోరికలను నెరవేర్చారు. ఒక విధంగా బలమైన ధైర్యం ఇచ్చారని చెప్పవచ్చు. మరి రాబోయే పుష్ప, శ్యామ్ సింగరాయ్ , RRR, రాధేశ్యామ్, భీమ్లా నాయక్ సినిమాలకి ఈ రిజల్ట్ ఎంతవరకు హెల్ప్ అవుతుందో చూడాలి.