కరోనా కాటుకు సామాన్యులు, సెలెబ్రిటీలు అనే తేడా లేదు. అందరినీ ఈ మహమ్మారి ఆవహిస్తుంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా, ఎదో ఒక రూపంలో ఈ వైరస్ సోకడం కలవర పెడుతుంది. కాగా దర్శకుడు రాజమౌళి ఫ్యామిలీకి కరోనా సోకడం సంచలనంగా మారింది. రాజమౌళి ట్విటర్ వేదికగా స్వయంగా ఈ విషయాన్ని తెలియజేశారు. తనతో పాటు కుటుంబ సభ్యులలో జ్వరం లక్షణాలు కనిపించడంతో కరోనా టెస్ట్ చేయించుకున్నారట. కరోనా టెస్టులలో వారికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయ్యిందట.
దీనితో డాక్టర్స్ పర్యవేక్షణలో హోమ్ కొరెంటైన్ అయినట్లు తెలియజేశారు. రాజమౌళి కుటుంబంలో ఎవరెవరు దీని బారిన పడ్డారు అనే విషయాన్ని రాజమౌళి స్పష్టంగా తెలియజేయలేదు. ఇక లాక్ డౌన్ సమయం నుండి రాజమౌళి మరియు కుటుంబ సభ్యులు ఎక్కువగా ఇంటిలోనే గడుపుతున్నారు. అలాగే అనేక భద్రతా నియమాలు పాటిస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో రాజమౌళి కుటుంబానికి కరోనా ఎలా సోకింది అనేది అర్థం కావడం లేదు. ఆ మధ్య ఆర్ ఆర్ ఆర్ సెట్ విషయంలో ఆయన బయటికి వెళ్లారు.
అది జరిగి కూడా చాలా కాలం అవుతుంది. రాజమౌళికి కుటుంబానికి కరోనా సోకడంతో టాలీవుడ్ మరింత అప్రమత్తం అయ్యింది. అసలు బయటికి వెళ్లడం సేఫ్ కాదనే నిర్ణయానికి వచ్చారని సమాచారం.
Most Recommended Video
పవర్ స్టార్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఎస్.ఎస్.రాజమౌళి సినిమాల IMDB రేటింగ్స్!
తెలుగు సినిమాల్లో నటించిన 27 బాలీవుడ్ హీరోయిన్లు ఎవరో తెలుసా?