Rajamouli, Kantara: సినిమా హిట్ అవ్వడానికి కంటెంట్ ముఖ్యం…ప్రచారం కాదు: రాజమౌళి

కన్నడ హీరో రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలోనే ఆయన హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం కాంతార. ఈ సినిమా కేవలం కన్నడ భాషలో మాత్రమే కాకుండా ఇతర భాషలలో కూడా విడుదలయ్యి ఎలాంటి ఆదరణ సంపాదించుకుందో మనకు తెలిసిందే. ఇలా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి ఆదరణ సంపాదించుకున్న ఈ సినిమాపై ఎంతోమంది ప్రశంసల వర్షం కురిపించారు. ఇక తెలుగు చిత్ర పరిశ్రమలో దర్శక ధీరుడుగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఎస్ఎస్ రాజమౌళి

ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమా ఆస్కార్ ప్రమోషన్ కార్యక్రమాలలో బిజీగా ఉన్నారు. ఇక ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ఎలాంటి ఆదరణ సంపాదించుకుందో మనకు తెలిసిందే. ఎంతో మంది హాలీవుడ్ దర్శకులు కూడా జక్కన్న పై ప్రశంసలు కురిపించారు. ఇలా దర్శకుడుగా ఇంటర్నేషనల్ స్థాయిలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న రాజమౌళి ఒక సినిమా గురించి మాట్లాడి ప్రశంసలు కురిపిస్తే చిత్ర బృందం ఎంతో సంతోషం వ్యక్తం చేస్తారు.

ఈ క్రమంలోనే తాజాగా రాజమౌళి కాంతర సినిమా గురించి చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. తాజాగా ఫిల్మ్ కంపానియన్ తో రాజమౌళి మాట్లాడుతూ.. ఒక సినిమా హిట్ అయ్యి మంచి కలెక్షన్ల ను రాబట్టాలి అంటే భారీ బడ్జెట్ పెట్టి సినిమా చేయాల్సిన పనిలేదు. అలాగే ప్రచారం అంతకన్నా చేయాల్సిన పనిలేదు మన కథలో కంటెంట్ ఉంటే ప్రచారం కూడా అవసరం లేదని,

కాంతార వంటి చిన్న సినిమాలకు కూడా భారీ కలెక్షన్లను రాబడతాయని ఈ సందర్భంగా రాజమౌళి కాంతార సినిమా హిట్ గురించి చేస్తున్నటువంటి ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

గుర్తుందా శీతాకాలం సినిమా రివ్యూ& రేటింగ్!
పంచతంత్రం సినిమా రివ్యూ & రేటింగ్!

ముఖచిత్రం సినిమా రివ్యూ & రేటింగ్!
బిగ్ బాస్ కోసం నాగార్జున ధరించిన 10 బ్రాండ్స్, కాస్ట్యూమ్స్ మరియు షూస్ కాస్ట్ ఎంతంటే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus