SSMB 29 : నెల జీతాలకి పనిచేస్తున్న రాజమౌళి- మహేష్..!

టాలీవుడ్లో ఇప్పుడు నిర్మాతల పరిస్థితి దారుణంగా ఉంది. పెద్ద సినిమాలకు వాళ్ళు నలిగిపోతున్నారు. ఒకప్పటితో పోలిస్తే ప్రొడక్షన్ కాస్ట్ ఇప్పుడు భారీగా పెరిగిపోయింది. ఒక బడ్జెట్ అనుకుని షూటింగ్ కు దిగితే.. కంప్లీట్ అయ్యేసరికి 30 శాతం నుండి 50 శాతం బడ్జెట్ పెరిగిపోతుంది. ‘గేమ్ ఛేంజర్’ (Game Changer) ‘పుష్ప 2’ (Pushpa 2) ‘దేవర’(Devara) ‘కల్కి 2898 ad’ (Kalki 2898 AD) వంటి సినిమాలకు బడ్జెట్ అలాగే పెరిగిపోయింది. అవి రిలీజ్ అయ్యే టైం వరకు నిర్మాతలు ఇంట్రెస్ట్..ల భారంతో కిందా మీదా పడుతుంటారు.

SSMB 29

బిజినెస్ అయ్యే వరకు వాళ్ళకి ఆ టెన్షన్ తప్పదనే చెప్పాలి. రాజమౌళి  (S. S. Rajamouli)  సినిమాలకు అయితే ఇలాంటి టెన్షన్స్ నిర్మాతలకి ఎక్కువగా ఉండవు. ఎందుకంటే పెట్టిన రూపాయికి 10 రూపాయలు వెనక్కి రప్పించగల సత్తా రాజమౌళికి ఉంది. ‘బాహుబలి’ (Baahubali) నుండి రాజమౌళి ఓ కొత్త ఫార్ములాని ఫాలో అవుతున్నాడు. వాస్తవానికి ‘బాహుబలి’ సినిమాకు గాను ప్రభాస్ కి  (Prabhas)  అడ్వాన్స్ తప్ప ఎటువంటి పారితోషికం ఇవ్వలేదు. పైగా ప్రభాస్ తరఫున యూవీ క్రియేషన్స్ వారు కొంత పెట్టుబడి కూడా పెట్టారు.

రిలీజ్ తర్వాత వచ్చిన లాభాల్లో వారు వాటాలు తీసుకున్నారు. ‘ఆర్.ఆర్.ఆర్’ (RRR) సినిమాకి కూడా అంతే..! అందువల్ల నిర్మాతలపై భారం తగ్గింది. ఇప్పుడు మహేష్ తో (Mahesh Babu) చేస్తున్న సినిమాకి మరో అడుగు ముందుకేశాడు రాజమౌళి. ఈ సినిమాకు కె.ఎల్.నారాయణ్, ఎస్ గోపాల్ రెడ్డి..లు నిర్మాతలు. వీళ్ళతో పాటు మరో ఇద్దరు నిర్మాతలు కూడా పెట్టుబడులు పెడుతున్నట్టు వినికిడి. ఇక మహేష్- రాజమౌళి ఈ ప్రాజెక్టు (SSMB 29 ) కోసం ఎటువంటి పారితోషికం తీసుకోలేదట.

‘పోకిరి’  (Pokiri) టైంలో ఇద్దరికీ నిర్మాతలు అడ్వాన్స్ ఇచ్చి హోల్డ్ చేశారు.ప్రస్తుతం వీళ్ళు తమ ఖర్చుల కోసం నెల జీతాలు మాత్రమే తీసుకుంటున్నారట. అంతేకాకుండా వీళ్ళ టీం ఖర్చులు నిర్మాతలే పెట్టుకుంటారు. సినిమా రిలీజ్ టైంకి జరిగే బిజినెస్ లో వీళ్ళు వాటా తీసుకుంటారని సమాచారం. ఒక రకంగా చెప్పాలంటే ఈ మార్పు చాలా మంచిదే. నిర్మాతలపై వడ్డీల భారం తగ్గి.. తమ పూర్తి ఫోకస్ ప్రాజెక్టుపై పెడతారు.

మరోసారి టిల్లు కోసం ఎదురుచూపుల్లో నేహా శెట్టి!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus