దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి ఐదేళ్లపాటు శ్రమించి తెరకెక్కించిన బాహుబలి కంక్లూజన్ భారీ విజయాన్ని సాధించి కష్టాన్ని మరిచిపోయేలా చేసింది. ప్రభాస్, అనుష్క, తమన్నా తదితరులు నటించిన ఈ సినిమా 21 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 1502 కోట్లు కొల్లగొట్టి అత్యధిక కలక్షన్స్ సాధించిన భారతీయ చిత్రంగా రికార్డ్ నెలకొల్పింది. ఎంతో క్రేజ్ ఉన్న ఈ మూవీని పైరసీ దారులు ఆన్లైన్లో పెట్టడానికి విశ్వప్రయత్నం చేశారు. వారి ఆగడాలను అరికట్టడానికి సైబర్ క్రైమ్ పోలీసులు గట్టి చర్యలు తీసుకున్నారు.
నెట్లో సినిమాను ఉంచిన కొంతమందిని అరెస్ట్ కూడా చేశారు. నిర్మాతకు, డిస్టిబ్యూటర్లకు నష్టాలు రాకుండా చేయడానికి ఎంతో శ్రమించారు. అంత కృషి చేసిన వారిని రాజమౌళి స్వయంగా కలిసి ధన్యవాదాలు చెప్పారు. ఈరోజు ఆయన నిర్మాత శోభ యార్లగడ్డతో కలిసి హైదరాబాద్ లోని సీసీఎస్, సైబర్ కార్యాలయానికి వెళ్లి అధికారులను కలుసుకున్నారు. బాహుబలి-2 పైరసీ కేసు వివరాలను ఏసీపీ రఘవీర్‌ని అడిగి తెలుసుకున్నారు.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.