టయోటా వెల్‌ఫైర్ గురించి ఈ విషయాలు తెలిస్తే షాకే!

మన సినిమా వాళ్లకు కార్లంటే భలే మోజు. అందుకే ఎంత ధర అయినా పెట్టి కార్లు కొంటూ ఉంటారు. స్టేటస్‌కి సింబల్‌ అనుకుంటారా, లేక మంచి కారు ఉండాలి అనుకుంటారా? అనేది పక్కన పెడితే భలే కార్లు అయితే కొంటూ ఉంటారు. అలా టయోటాకు చెందిన ప్రత్యేకమైన వెల్‌ఫైర్‌ కారును టాలీవుడ్‌కి చెందిన ఇద్దరు ప్రముఖులు వాడుతున్నారు. చూడటానికి భలేగా కనిపించే కారు పేరు టయోటా వెల్‌ఫైర్‌. ఈ కారులో అంతలా ప్రత్యేకతలు ఏమున్నాయో చూడండి మరి.

Click Here To Watch NOW

టయోటా వెల్‌ఫైర్ కారు… పూర్తిగా లగ్జరీ ఎంపీవీ కారు. ఈ కారును ప్రముఖ దర్శకుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి, ప్రముఖ హీరో నాగచైతన్య ఈ కార్లను వాడుతున్నారు. ఇద్దరివీ బ్లాక్‌ కలర్‌ కార్లే. మొన్నీమధ్య రాజమౌళి ఆసిఫాబాద్‌ జిల్లాకు వెళ్లి బబుల్‌ థియేటర్‌ చూసినప్పుడు ఈ కారులోనే వెళ్లారు. ఇక నాగచైతన్య కారును పోలీసులకు ఆపి.. బ్లాక్‌ ఫిల్మ్ తీసి, ఫైన్‌ వేసిన సందర్భంలో ఈ కారు కనిపించింది. ఈ నేపథ్యంలో అసలు ఈ కారు ప్రత్యేకతలు ఏంటో చూద్దాం.

టయోటా వెల్‌ఫైర్ దేశంలోనే అత్యంత విలాసవంతమైన కారు అని చెప్పొచ్చు. కారులో మూడు వరుసల్లో సీట్లు ఉంటాయి. ఎగ్జిక్యూటివ్ లాంజ్‌లో ఉండే ఛైర్స్‌లా సీట్లు ఉంటాయి. ఈ సీట్లు వెనక్కి కదులుతాయి కూడా. కాళ్లను రిలాక్స్‌గా ముందుకు పెట్టుకునేలా ఏర్పాటు కూడా ఉంది. డ్రైవర్, ప్యాసింజర్ సీట్లు, రెండో వరుసలో ఉన్న సీట్లలో స్ప్లిట్‌ సన్‌ రూఫ్, ఆర్మ్‌ రెస్ట్, సాఫ్ట్ రీడింగ్ లైట్ ఉంటాయి. సీట్ పొజిషన్‌లను సర్దుబాటు చేయడానికి రిమోట్ కంట్రోల్ సిస్టమ్ కూడా ఉంది.

వెనుక సీట్లలో కూర్చున్న వారి కోసం స్క్రీన్, ఆడియో సిస్టమ్, ప్రైవసీ స్క్రీన్‌లు ఉంటాయి. కారు విశాలంగా ఉండటం వల్ల లెగ్‌ రూమ్, హెడ్‌ రూమ్, లంబార్ సపోర్ట్‌ ఉంటుంది. ఈ కారు లగ్జరీలోనే కాదు సేఫ్టీలోనూ స్పెషలే. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు లోపల ఉన్నవారిని సురక్షితంగా ఉండటానికి ఏడు ఎయిర్‌బ్యాగ్‌లు ఇస్తున్నారు. ఏబీఎస్‌, బ్రేక్ అసిస్ట్ సిస్టమ్‌ల, పానిక్ బ్రేక్‌ ఉన్నాయి. ట్రాక్షన్ కంట్రోల్, స్టెబిలిటీ కంట్రోల్ కూడా ఉంది. పార్కింగ్ కోసం సెన్సర్‌తోపటు, 360 డిగ్రీల కెమెరా ఉంటుంది. దీని వల్ల పార్కింగ్‌ సులభం.

సెల్ఫ్ ఛార్జింగ్ హైబ్రీడ్ సిస్టమ్‌తో ఈ కారు పని చేస్తుంది. ఆటోమేటిక్ స్లైడింగ్ డోర్లు ఈ కారుకున్న మరో ప్రత్యేకత. బటన్ నొక్కితే కారు డోర్లు వాటికవే తెరుచుకుంటాయి. ఇది ఎలక్ట్రిక్, పెట్రోల్‌తో నడిచే హైబ్రిడ్ మోడల్‌. ఈ కారు ఎక్స్‌- షోరూమ్ ధర ₹87 లక్షల నుండి ₹90 లక్షలు. ఆన్ రోడ్ ప్రైస్ ₹1.11 కోట్లు ఉంటుందని అంచనా. ఈ ధర ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా ఉంటుంది.

‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ నుండీ అదిరిపోయే 20 డైలాగులు..!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
‘ప్రతిఘటన’ తో గోపీచంద్ తండ్రి టి.కృష్ణ దర్శకత్వం వహించిన సినిమాల లిస్ట్..!
5 ఏళ్ళ కెరీర్ లో రష్మిక మందన మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus