Rajamouli: అక్కడ సత్తా చాటుతున్న రాజమౌళి మేనకోడలు?

స్టార్ డైరెక్టర్ రాజమౌళికి ప్రేక్షకుల్లో ఉండే క్రేజ్, గుర్తింపు అంతాఇంతా కాదు. ఇంటర్ మాత్రమే చదివినా రాజమౌళి తన సినిమాల ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఊహించనిస్థాయిలో గుర్తింపును సొంతం చేసుకున్నారు. అయితే రాజమౌళి మేనకోడలు ఇషితా కోడూరి కూడా తన ప్రతిభతో వార్తల్లో నిలిచారు. ఒకప్పుడు కొన్ని ఆటలు మగవాళ్లు మాత్రమే ఆడేవారు. అయితే కాలంతో పాటే వచ్చిన మార్పు వల్ల స్పోర్ట్స్ లో అమ్మాయిలు కూడా సత్తా చాటుతున్నారు. అబ్బాయిలు స్పోర్ట్స్ లో ఏ విధంగా విజయాలను అందుకుంటున్నారో అమ్మాయిలు కూడా స్పోర్ట్స్ లో అదే విధంగా విజయాలను అందుకుంటున్నారు.

జక్కన్న కోడలు ఇషిత కోడూరి ఉమెన్ క్రికెట్ టీమ్ లో ప్లేయర్ కావడం గమనార్హం. తాజాగా జరిగిన ఉమెన్ అండర్ 19 ఆటలలో ఇషిత కోడూరి పాల్గొనగా ఆమె ఆటను చూసిన నెటిజన్లు అవాక్కయ్యారు. ఇషిత కోడూరి బౌలర్ గా క్రికెట్ ఫ్యాన్స్ ను ఎంతగానో ఆకట్టుకున్నారు. ఇషిత మూడు వికెట్లను తీసి హైదరాబాద్ గెలవడానికి ఎంతో కృషి చేశారు. జక్కన్న ట్విట్టర్ ద్వారా షేర్ చేయడంతో ఈ వార్త వెలుగులోకి వచ్చింది. జక్కన్న కూడా స్పోర్ట్స్ ను ఎంతో ఇష్టపడతారు.

జక్కన్న ట్వీట్ లో నా పిల్లలను స్పోర్ట్స్ ఫీల్డ్ లోకి పంపాలని అనుకున్నా వాళ్లు ఇతర ఫీల్డ్స్ ను ఎంచుకున్నారని మేన కోడలు ఇషిత కోడూరి మాత్రం స్టేట్ సీనియర్ ఉమెన్ క్రికెట్ టీమ్‌కు ఎంపికయ్యారని జక్కన్న పేర్కొన్నారు. ఇషితకు ఆల్ ది బెస్ట్ చెబుతూ రాజమౌళి చేసిన ట్వీట్ నెట్టింట వైరల్ అవుతోంది.

వరుడు కావలెను సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

రొమాంటిక్ సినిమా రివ్యూ & రేటింగ్!
పునీత్ రాజ్ కుమార్ సినీ ప్రయాణం గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
ఇప్పటివరకు ఎవ్వరూ చూడని పునీత్ రాజ్ కుమార్ ఫోటోలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus