Rajamouli: తన సినిమాల విజయ రహస్యం బయట పెట్టిన రాజమౌళి!

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఎస్.ఎస్ రాజమౌళి బాహుబలి వంటి బ్లాక్ బస్టర్ సినిమాతో పాన్ ఇండియా డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. తర్వాత రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన మల్టీ స్టార్ మూవీ RRR తో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకొని టాలీవుడ్ ఇండస్ట్రీ స్థాయిని ప్రపంచవ్యాప్తం చేశాడు అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇప్పటికే ఈ చిత్రానికి పలు అంతర్జాతీయ అవార్డులు దక్కించుకున్న విషయం మనందరికీ తెలిసిందే. తాజాగా 2023 గోల్డెన్ గ్లోబ్ అవార్డుకు నామినేట్ కావడంతో ఈ చిత్ర యూనిట్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

ఇటీవలే ఎస్.ఎస్ రాజమౌళి ప్రముఖ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన విజయ రహస్యాలను ప్రేక్షకులతో పంచుకోవడం జరిగింది. విజయానికి ప్రత్యేకంగా రహస్యమేమీ ఉండదు రెండు విషయాలను కచ్చితంగా పాటిస్తే విజయం తనంతట తానే మన చెంతకు చేరుతుందని ఈ సందర్భంగా తెలియజేశారు. ప్రేక్షకులతో అనుబంధం, కష్టపడడం ఈ రెండు విషయాలను పాటిస్తే మనకు కచ్చితంగా విజయం లభిస్తుంది. సినిమా కమర్షియల్ గా విజయం సాధించి ప్రేక్షకు ఆదరణ పొందితే ఆ విజయాన్ని మాటల్లో చెప్పలేము మనం పడ్డ కష్టమంతా ప్రేక్షకుల ఆనందంలో మనం చూడొచ్చు.

RRR సినిమా షూటింగ్ సమయంలో మీరు చాలా కష్టపడ్డారు అని చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది. ఈ సినిమా షూటింగ్ సమయంలో మీరు ఎన్ని నిద్రలేని రాత్రులు అనుభవించారు చెప్పండి అని ప్రశ్నించగా అందుకు రాజమౌళి సమాధానం చెబుతూ మేము జూనియర్ ఎన్టీఆర్ యానిమల్ సీక్వెన్స్ సన్నివేశాలు చిత్రీకరించినప్పుడు మా చిత్ర యూనిట్ సభ్యులందరూ నిద్రలేని రాత్రులను గడిపారు

ఎందుకంటే అవన్నీ రాత్రి సమయాల్లోని చిత్రీకరించాల్సిన సన్నివేశాలు కాబట్టి అంటూ రాజమౌళి చమత్కారంగా హాస్యాన్ని పండించారు.సూపర్ స్టార్ మహేష్ బాబు దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి కాంబినేషన్లో ఓ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా వచ్చే ఏడాది సెట్స్ మీదకు వెళ్లే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

గుర్తుందా శీతాకాలం సినిమా రివ్యూ& రేటింగ్!
పంచతంత్రం సినిమా రివ్యూ & రేటింగ్!

ముఖచిత్రం సినిమా రివ్యూ & రేటింగ్!
బిగ్ బాస్ కోసం నాగార్జున ధరించిన 10 బ్రాండ్స్, కాస్ట్యూమ్స్ మరియు షూస్ కాస్ట్ ఎంతంటే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus