Sukumar, Ram Charan: రంగస్థలం కాంబో ఫిక్స్.. క్లారిటి ఇచ్చిన రాజమౌళి!

దర్శకధీరుడు రాజమౌళి క్రియేటివ్ దర్శకుడు సుకుమార్ ఇద్దరు కూడా మంచి స్నేహితులు అని అందరికి తెలిసిన విషయమే. బయట ప్రపంచానికి తెలియదు గాని ఇద్దరు కూడా రారా.. అనుకుంటూ తిట్టుకునే రకం. ఈ స్నేహితులిద్దరికి ప్రత్యేకంగా ఒక వాట్సాప్ గ్రూప్ కూడా ఉంది. ఎవరు కథ రాసుకున్నా కూడా ఒకరితో మరొకరు చర్చించుకోకుండా ఉండలేరు. ఆఖరికి సుక్కు ప్లాప్ సినిమాను కూడా జక్కన్న ఎంతగానో లైక్ చేస్తాడు. ఇక ఇటీవల రాజమౌళి సుకుమార్ తదుపరి సినిమాకు సంబంధించిన ఒక ఆసక్తికరమైన విషయాన్ని కూడా చెప్పేశాడు.

ప్రస్తుతం రాజమౌళి అలాగే రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ సౌత్ నార్త్ అని తేడా లేకుండా వరుసగా ఇంటర్వ్యూలతో సినిమాను ప్రమోట్ చేస్తున్నారు. అయితే సినిమాకు సంబంధించిన అనేక రకాల అంశాలను చెప్పడంతో పాటు హీరోలు అలాగే దర్శకుడు వారి మధ్య ఉన్న అనుబంధం గురించి కూడా ఎంతగానో మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇక రామ్ చరణ్ తన తదుపరి ప్రాజెక్ట్ ల గురించి చెబుతూ ఉండగా సుకుమార్ తో కూడా ఒక సినిమా ఉంటుందని రాజమౌళి ఒక సీన్ గురించి ఓపెన్ అయ్యాడు.

సుక్కు చరణ్ కాంబినేషన్లో వచ్చే సినిమాలో ఓపెనింగ్ సీక్వెన్స్ లో ఉండే సన్నివేశం మామూలుగా ఉండదట. ఆడియెన్స్ షాక్ అయ్యేలా హార్డ్ హిట్టింగా ఉంటుందట. ఇక అంతకంటే నేను ఎక్కువగా రివీల్ చేయలేనని లేదంటే సుకుమార్ కు హార్ట్ ఎటాక్ వస్తుందని రాజమౌళి నవ్వుతూ అన్నాడు. ఏదేమైనా కూడా ఇన్ని రోజుల వస్తున్న రూమర్స్ కు మొత్తానికి చెక్ పడింది. రామ్ చరణ్ సుకుమార్ కాంబినేషన్ లో రంగస్థలం లాంటి బాక్సాఫీస్ హిట్ అనంతరం

మరో సినిమా రాబోతున్నట్లు క్లారిటీ వచ్చేసింది. ఇక సుకుమార్ పుష్ప 2 తరువాత రామ్ చరణ్ తోనే సినిమా చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక చరణ్ ఆ లోపు శంకర్ తో తన 15వ సినిమాని ఫినిష్ చేసి గౌతమ్ తిన్ననూరి, సుక్కు ప్రాజెక్ట్ లను ఒకేసారి సెట్స్ పైకి తీసుకు రావచ్చని సమాచారం.

శ్యామ్ సింగరాయ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

83 సినిమా రివ్యూ & రేటింగ్!
వామ్మో.. తమన్నా ఇన్ని సినిమాల్ని మిస్ చేసుకుండా..!
‘అంతం’ టు ‘సైరా’.. నిరాశపరిచిన బైలింగ్యువల్ సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus