‘ఆర్.ఆర్.ఆర్’ కోసం దేశ విదేశాల్లో అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇద్దరు స్టార్ హీరోలు కలిసి నటిస్తున్న ఈ భారీ మల్టీ స్టారర్ కథ ఎలా ఉండబోతుంది అనే ఉత్కంఠత అందరిలోనూ ఉంది. అయితే ఇటీవల రాజమౌళి ఓ టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో ఈ చిత్రం కథ గురించి చెప్పుకొచ్చాడు. ‘స్వతంత్య్రానికి ముందు అల్లూరి, కొమరం భీం గురించి మనమంతా చదువుకున్నాము. అయితే వాళ్ల గురించి తెలియని విషయాలను ఫిక్షనల్ గా చెప్పే ప్రయత్నం చేస్తున్నాం.
1919-22 మధ్య ప్రాంతంలో ఒకేసారి ఇంట్లో నుండీ వెళ్లిపోయిన ఈ ఇద్దరు యోధులు.. ఆ మూడు నాలుగేళ్లు ఏం చేసారనేది చరిత్రలో లేదు. తిరిగి వచ్చిన తర్వాతే వాళ్లెలా స్వాంతంత్య్రం కోసం పోరాడారో చరిత్ర చెబుతుంది’ అంటూ చెప్పుకొచ్చాడు రాజమౌళి. ఇక ఈ చిత్రానికి ‘రౌద్రం రణం రుథిరం’ అనే టైటిల్ ను తెలుగు వెర్షన్ కు ఫైనల్ చేసాడు రాజమౌళి. 400 కోట్ల భారీ బడ్జెట్ తో డి.వి.వి. దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ .. కొమరం భీమ్ గా నటిస్తుండగా రాంచరణ్ అల్లూరి సీతా రామరాజు పాత్రలో కనిపించనున్నాడు.
చరణ్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన ‘భీమ్ ఫర్ రామరాజు’ వీడియోకి అద్బుతమైన స్పందన లభించింది. ఇక ఎన్టీఆర్ పుట్టిన రోజు అయిన మే 20 న కూడా ‘రామరాజు ఫర్ భీమ్’ అంటూ మరో వీడియోని విడుదల చెయ్యడానికి రాజమౌళి ప్లాన్ చేస్తున్నాడు.
Most Recommended Video
తండ్రికి తగ్గ తనయలు అనిపిస్తున్న డైరెక్టర్స్ కూతుళ్లు!
నిర్మాతలుగా కూడా సత్తా చాటుతున్న టాలీవుడ్ హీరోలు!
టాలీవుడ్ టాప్ హీరోల వరస్ట్ లుక్స్ ఇవే!