స్టార్ డైరెక్టర్ రాజమౌళి డైరెక్షన్ లో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ సినిమా మరో రెండు వారాల్లో విడుదలకు సిద్ధంగా ఉంది. అయితే దర్శకధీరుడు రాజమౌళి ఈ సినిమా ప్రమోషన్స్ ను ఇంకా మొదలుపెట్టలేదు. మరోవైపు రాధేశ్యామ్ సినిమాకు మాత్రం జక్కన్న ప్రమోషన్స్ చేస్తున్నారు. రాధేశ్యామ్ సినిమాకు వాయిస్ ఓవర్ అందించిన జక్కన్న ఈ సినిమా సక్సెస్ కావడానికి తన వంతు కృషి చేస్తుండటం గమనార్హం. అయితే స్టార్ హీరో ప్రభాస్ రాజమౌళిని రాధేశ్యామ్ సినిమాను ఎందుకు ప్రమోట్ చేస్తున్నావని ప్రశ్నించగా రాజమౌళి నుంచి షాకింగ్ సమాధానం వచ్చింది.
తాజాగా రాజమౌళి ప్రభాస్ ను రాధేశ్యామ్ సినిమాకు సంబంధించి స్పెషల్ ఇంటర్వ్యూ చేశారు. ఈ ఇంటర్వ్యూలో రాజమౌళి ప్రభాస్ ను ఎన్నో ప్రశ్నలు అడగగా ప్రభాస్ మాత్రం జక్కన్నను రాధేశ్యామ్ సినిమాకు ప్రమోషన్స్ చేయడానికి గల కారణం అడిగారు. ఆ ప్రశ్నకు జక్కన్న స్పందిస్తూ నువ్వు నా డార్లింగ్.. నీకోసం ఏదైనా చేస్తానని బదులిచ్చారు. రాజమౌళి చెప్పిన సమాధానం విని ప్రభాస్ తో పాటు ప్రభాస్ అభిమానులు కూడా ఫిదా అయ్యారు.
యూవీ క్రియేషన్స్, గోపీకృష్ణ మూవీస్ సంయుక్తంగా నిర్మించిన ఈ పాన్ ఇండియా మూవీ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాల్సి ఉంది. ఈ పాన్ ఇండియా ప్రేమకథకు హైదరాబాద్ లో అడ్వాన్స్ బుకింగ్స్ భారీస్థాయిలో జరుగుతున్నాయి. ఏపీలోని పలు ఏరియాల్లో మాత్రం ఈ సినిమాకు అడ్వాన్స్ బుకింగ్స్ మొదలుకావాల్సి ఉంది. కొత్త టికెట్ల జీవో ప్రకారం ఈ సినిమాకు టికెట్ల అమ్మకాలు జరగనున్నాయి.
బాక్సాఫీస్ వద్ద రాధేశ్యామ్ సంచలనాలు సృష్టిస్తుందేమో చూడాల్సి ఉంది. పలు ఏరియాల్లో ఆర్ఆర్ఆర్ మూవీకి ధీటుగా రాధేశ్యామ్ సినిమాకు బిజినెస్ జరిగింది. ఫుల్ రన్ లో రాధేశ్యామ్ ఏ స్థాయిలో కలెక్షన్లను సొంతం చేసుకుంటుందో చూడాల్సి ఉంది.