ఆ విషయం నేను ఎప్పటికీ పెట్టుకుంటాను : రాజమౌళి

దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి, మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఎంతో మంచి ఫ్రెండ్స్ అన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ‘స్టూడెంట్ నెంబర్ 1’ ‘సింహాద్రి’ ‘యమదొంగ’ వంటి హిట్ చిత్రాలు వీరి కాంబినేషన్ లో వచ్చాయి. ఎన్టీఆర్ కు ‘స్టూడెంట్ నెంబర్1’ చిత్రంతో మొదటి హిట్ ఇచ్చింది రాజమౌళి. ‘సింహాద్రి’ తో స్టార్ హీరోని చేసింది రాజమౌళి. అంతేకాదు ఎన్టీఆర్ వరుస ప్లాప్ లతో ఉన్నప్పుడు… అతని లుక్ తో విమర్శలు పాలైనప్పుడు… మొత్తం ఎన్టీఆర్ లుక్ ను మార్చేసి..’యమదొంగ’ తో హిట్ ఇచ్చి.. ఆదుకున్నది కూడా రాజమౌళినే. ఒక విధంగా చెప్పాలి అంటే ఎన్టీఆర్ ను మళ్ళీ రీ లాంచ్ చేసాడనే చెప్పాలి.

అది కూడా తనే నిర్మాతగా మారి. ‘ఎన్టీఆర్ లో నెంబర్ వన్ హీరో కనిపిస్తాడు’ అని గతంలో ఓ సందర్భంలో కూడా రాజమౌళి చెప్పాడు. అయితే ‘నా మొదటి సినిమాకి ఇలాంటి హీరో దొరికాడేమిటి’ అని కూడా ఫీలయ్యానని జక్కన్న ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. ఆయన మాట్లాడుతూ…”తారక్‌తో మొదటి సినిమా ‘స్టూడెంట్ నెంబర్1’ చేసేటప్పుడు.. అతనికి 19 సంవత్సరాలు. సరిగ్గా మీసాలు కూడా రాలేదు. అంతేకాకుండా.. చాలా లావుగా ఉండేవాడు.

హెయిర్ స్టైలింగ్, పర్సనల్ మెయిన్‌టైనెన్స్ కూడా లేదు. ‘నాకేంటి మొదటి సినిమాకి ఇలాంటి హీరో దొరికాడని’ చాలా ఫీల్ అయ్యాను. సరే మొదటి సినిమా కదా అని.. నేను వర్క్ స్టార్ట్ చేశాను. సడన్‌గా మధ్యలో ఇంటెర్వెల్ సీన్స్‌లో ఎన్టీఆర్ డైలాగ్స్ చెబుతున్నప్పుడు అనుకున్నా.. ఇతను కచ్చితంగా పెద్ద సూపర్ స్టార్ అవుతాడని. అతని లోపల ఏదో సమ్‌థింగ్ స్పెషల్ ఉందని. తన లుక్స్‌ని దాటి జనాల్ని డైలాగ్స్‌తో విపరీతంగా అట్రాక్ట్ చేసే టాలెంట్ ఇతనిలో ఉంది. నేను ఇప్పటివరకూ ఒక కన్నుతో చూసి తప్పు చేశాను అని నాకు అనిపించింది. ఈ విషయాన్ని నేను ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటాను” అని రాజమౌళి చెప్పుకొచ్చాడు.

Most Recommended Video

తండ్రికి తగ్గ తనయలు అనిపిస్తున్న డైరెక్టర్స్ కూతుళ్లు!
నిర్మాతలుగా కూడా సత్తా చాటుతున్న టాలీవుడ్ హీరోలు!
టాలీవుడ్ టాప్ హీరోల వరస్ట్ లుక్స్ ఇవే!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus