Rajamouli: సినిమాల నిర్మాణం విషయంలో రాజమౌళి సంచలన నిర్ణయం.. కానీ?

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో ఒకరైన రాజమౌళి మహేష్ బాబుతో తెరకెక్కించే సినిమా స్క్రిప్ట్ వర్క్ ను ఇప్పటికే పూర్తి చేశారని తెలుస్తోంది. ఈ సినిమాకు కథ, కథనం అద్భుతంగా కుదిరాయని రాజమౌళి రెండేళ్లలో ఈ సినిమా షూటింగ్ ను పూర్తి చేసే అవకాశాలు ఉన్నాయని సమాచారం అందుతోంది. అయితే రాజమౌళి సమర్పకుడిగా రాజమౌళి కొడుకు కార్తికేయ నిర్మాతగా మరో డైరెక్టర్ డైరెక్షన్ లో ఒక సినిమా అని వార్త ప్రచారంలోకి వచ్చింది.

అయితే అసలు నిజం ఏంటంటే రాజమౌళి ఇండియన్ సినిమాపై ఒక డాక్యుమెంటరీ చేయనున్నారని ఈ సినిమా థియేటర్ సినిమా కాదని తెలుస్తోంది. ఓటీటీ సంస్థ కోసం రాజమౌళి ఈ డాక్యుమెంటరీ దిశగా అడుగులు వేస్తున్నట్టు సమాచారం. మరోవైపు మహేష్ తో సినిమా పూర్తైన తర్వాత రాజమౌళి బయటి బ్యానర్లలో సినిమాలు చేసే అవకాశాలు అయితే తక్కువని సమాచారం అందుతోంది.

తన సన్నిహితుల సహాయంతో రాజమౌళి సొంతంగా సినిమాలను నిర్మించనున్నారని సమాచారం. జక్కన్న ఈ దిశగా అడుగులు వేస్తే బాగుంటుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జక్కన్న తన సినిమాలకు కళ్లు చెదిరే స్థాయిలో లాభాలు వస్తుండటంతో ఈ దిశగా అడుగులు వేస్తున్నారని సమాచారం అందుతోంది. రాజమౌళి మహేష్ కాంబో మూవీపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. మహేష్ జక్కన్న (Rajamouli)  కాంబో మూవీ అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోంది.

కేఎల్ నారాయణ నిర్మాతగా ఈ సినిమా తెరకెక్కుతుండటం గమనార్హం. 2026 సంవత్సరంలో రిలీజ్ కానున్న ఈ సినిమా ఏ రేంజ్ లో రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాల్సి ఉంది. మహేష్ జక్కన్న కాంబో మూవీ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉందని హాలీవుడ్ లెవెల్ లో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారని సమాచారం అందుతోంది. మహేష్ రాజమౌళి కాంబో మూవీ ఇతర భాషల్లో కూడా సంచలనాలు సృష్టించే అవకాశాలు అయితే ఉంటాయని తెలుస్తోంది.

మార్క్ ఆంటోనీ సినిమా రివ్యూ & రేటింగ్!

ఛాంగురే బంగారు రాజా సినిమా రివ్యూ & రేటింగ్!
సోదర సోదరీమణులారా సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus