కరోనా ఎఫెక్ట్ వల్ల ఇండియా వైడ్ లాక్ డౌన్ కొనసాగుతుంది. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు ప్రధాని మోడీ కూడా లాక్ డౌన్ మాత్రమే నివారణ మార్గంగా ఎంచుకుని ఆ దిశగా ఆదేశాలు జారీ చేసారు. ఇక దీని వల్ల సినీ పరిశ్రమకు కూడా బాగా దెబ్బ పడింది. మొన్నటికి మొన్న లాక్ డౌన్ ఏప్రిల్ 30 వరకూ మాత్రమే అని చెప్పిన తెలంగాణ ముఖ్యమంత్రి కె.సి.ఆర్… మోడీ మే 3 వరకూ లాక్ డౌన్ అని చెప్పిన తర్వాత.. దానిని మే 7 వరకూ కూడా అమలు చేస్తున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే.
దీంతో జూన్ వరకూ థియేటర్ లు ఓపెన్ అవ్వడం కష్టం అని మొన్నటి వరకూ అనుకున్నారు కానీ ఇప్పుడున్న పరిస్ధితిని బట్టి చూస్తుంటే ఆగష్టు వరకూ కష్టమే అని కొందరు అభిప్రాయ పడుతున్నారు. మొన్నటికి మొన్న సురేష్ బాబు … 2020 మొత్తం థియేటర్లు ఓపెన్ చేయడం కష్టమే అని కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు రాజమౌళి కూడా అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తుండడం గమనార్హం.’కరోనా ప్రభావం ఇప్పట్లో తగ్గే పరిస్థితి కనిపించడం లేదు.
థియేటర్లు తిరిగి ప్రారంభం కావడానికి.. మరో ఆరు నెలలు సమయం పట్టొచ్చు. కరోనా ప్రభావం తగ్గినా… ప్రజల్లో భయం పోయి థియేటర్లకు రావడానికి మరో 3 నెలలు టైం పడుతుంది’ అంటూ రాజమౌళి చెప్పుకొచ్చారు. దీనిని బట్టి చూస్తే.. ఈ ఏడాది థియేటర్ ఓపెన్ అయినా యూజ్ లేదని రాజమౌళి పరోక్షంగా చెప్పినట్టు సమాచారం.