దర్శక ధీరుడు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా తీస్తున్న భారీ మల్టీస్టార్ సినిమా ‘ఆర్ ఆర్ ఆర్’. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఇటీవలే హైదరాబాద్ లో వేసిన ఒక పెద్ద సెట్ లో ప్రారంభం అయినా విషయం తెలిసిందే. ఇక జక్కన్న బాహుబలి సినిమా తరువాత తీస్తున్న సినిమా కావడం, ఇద్దరు స్టార్ హీరోలు ఇందులో నటిస్తుండటంతో సినిమా పైన అంచనాలు ఒక రేంజులో పెరిగిపోయాయి. పని రాక్షసుడిగా పేరు ఉన్న జక్కన్న యాక్షన్ సీన్స్ తో షూటింగ్ స్టార్ట్ చేయగా ఈ ఫైట్ కోసం ఏకంగా 120 కెమెరాలను తెప్పించాడట.
ఇక ఫైట్ సీన్స్ లో 4D టెక్నాలజీ వాడబోతున్నట్లుగా సమాచారం.ఈ కెమెరాల కారణంగా వచ్చే ఎఫెక్ట్స్ చాలా పవర్ ఫుల్ గా ఉంటాయని చెబుతున్నారు. అంతేకాకుండా సీన్స్ లో ఉండే నటీనటుల ముఖకవళికలు, హావభావాలు ఇవి అద్భుతంగా క్యాప్చర్ చేస్తాయని అంటున్నారు. ఇలా భారీ సెట్ లో యాక్షన్ సీన్స్ ని తెరెకెక్కిస్తున్న జక్కన్న కథలో భాగంగా కొంతభాగం అడవుల్లో తీయాల్సింది ఉంటుందని, బాహుబలి సినిమాలో ‘కిలికి’ లాగ ఈ సినిమాలో అడవి భాషగా ఒక కొత్త భాష కనిపెట్టే పనిలో జక్కన్న ఉన్నట్లుగా తెలుస్తుంది. ఏదిఏమైనా షూటింగ్ స్టార్టింగ్ దశలోనే ఇంత ఆసక్తిని రేకెత్తిస్తున్న ఈ సినిమా రాను రాను ఎలాంటి సర్ప్రైజ్ లు ఇస్తుందో అని అనుకుంటున్నారు.