రాజమౌళి సినిమా – విజువల్ ఎఫెక్ట్స్.. ఈ రెండింటినీ విడదీయలేం. ఆయన సినిమాల్లో వీఎఫ్‌క్స్ ఏ స్థాయిలో ఉంటుంది అని అంటే.. కథకు సమానంగా ఉంటుంది అని చెప్పేయొచ్చు. అంతలా తన సినిమాల్లో వీఎఫ్ఎక్స్‌ను అంతలా వాడేస్తారయన. ‘ఈగ’ సినిమా తర్వాత రాజమౌళి విజువల్ ఎఫెక్ట్స్ మజా ఏంటో ప్రేక్షకులకు తెలిసొచ్చింది. ఆ తర్వాత ఆయన చేసిన సినిమాలన్నీ అలానే ఉన్నాయి. రాబోయేవి కూడా అలానే ఉంటాయి అని చెప్పేయొచ్చు.
రాజమౌళి నెక్స్ట్ సినిమా అంటే మహేష్‌బాబుతోనే. కెఎల్ నారాయణ నిర్మాణంలో ఈ సినిమా ఉంటుందని ఇప్పటికే తెలుసు. ఈ సినిమాకు సంబంధించి చాలా వార్తలు వస్తున్నా అందులో కన్‌ఫామ్ అయ్యింది మాత్రం ఈ సినిమా ఆఫ్రికన్ అడవుల నేపథ్యంలో సాగే అడ్వెంచరస్ థ్రిల్లర్ అని. అయితే కథ ఇంకా ఫైనల్ కాలేదని రాజమౌళి చెప్పారు. తమ దగ్గర రెండు ఆలోచనలు ఉన్నాయని కూర్చుని ఓకే చేసుకుంటాం అని ఆ మధ్య అన్నారు.
ఇంతవరకు కథకు సంబంధించి, ముహూర్తానికి, షూటింగ్‌కి సంబంధించి ఎలాంటి సమాచారం లేదు. అయితే కథ విషయం తండ్రి విజయేంద్ర ప్రసాద్ చూసుకుంటుండగా, రాజమౌళి విజువల్ ఎఫెక్ట్స్ పనులు మొదలుపెట్టారని అంటున్నారు. సినిమా కోసం ఈ సారి సరికొత్త విజువల్ ఎఫెక్ట్స్ చూపించాలని రాజమౌళి ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలోనే పారిస్‌లో ఉన్న యూనిట్ ఇమేజ్ అనే విజువల్ ఎఫెక్స్ట్ టీమ్‌ను కలసి చర్చించారట.
యూనిట్ ఇమేజ్ టీమ్ వీఎఫ్‌ఎక్స్, త్రీడీ యానిమేషన్ రంగంలో దిట్ట. నెట్‌ఫ్లిక్స్ లాంటి సంస్థలు యూనిట్ ఇమేజ్ వర్క్‌ను తీసుకుంటున్నాయి. ఇప్పుడు రాజమౌళి కూడా అదే పని చేయబోతున్నారు. రాజమౌళితో పాటు యూనిట్ ఇమేజ్ టీమ్‌ను కలిసిన వాళ్లలో ప్రముఖ నిర్మాత శోభు యార్లగడ్డ, వీఎఫ్‌క్స్ నిపుణులు కమల్ కణ్నన్ తదితరులు ఉన్నారు. వీరంతా వీఎఫ్‌ఎక్స్ గురించి చర్చించారట. త్వరలో మొదలయ్యే మహేష్ సినిమాలో యూనిట్ ఇమేజ్ టీమ్ వర్క్‌ను మంన చూడొచ్చు. మరి ఏ రేంజిలో వాళ్లు వర్క్ ఇస్తారు అనేది చూడాలి.
Most Recommended Video
‘ఆర్.ఆర్.ఆర్’, ‘అంటే..’ తో పాటు ఎక్కువ నిడివితో వచ్చిన లేటెస్ట్ సినిమాల లిస్ట్..!
‘2.0’ టు ‘విక్రమ్’ తమిళ్ లో భారీ కలెక్షన్లు రాబట్టిన 10 సినిమాల లిస్ట్..!
ఎన్టీఆర్, నాగ చైతన్య.. టు కీర్తి సురేష్, ‘గుండమ్మ కథ’ రీమేక్ కు సూట్ అయ్యే 10 మంది స్టార్లు..!