Rajamouli: మహేష్ సినిమా కోసం తొలిసారి జక్కన్న అలా చేస్తున్నారా?

  • August 29, 2022 / 11:56 AM IST

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో ఒకరైన రాజమౌళి తెరకెక్కించిన ప్రతి సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. ఆర్ఆర్ఆర్ మూవీ విడుదలై నాలుగు నెలలైనా ఈ సినిమా ఏదో ఒక విధంగా వార్తల్లో నిలుస్తోంది. మరోవైపు జక్కన్న ఇప్పటికీ ఈ సినిమాకు తన వంతు ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు. అయితే జక్కన్న ఈ విధంగా ఆర్ఆర్ఆర్ సినిమాను ప్రమోట్ చేయడం వెనుక అసలు కారణం వేరే ఉందని సమాచారం అందుతోంది.

ఆర్ఆర్ఆర్ సినిమాలో హీరోగా నటించిన తారక్ ఆస్కార్ నామినేషన్స్ లో ఉండే అవకాశం ఉందని వెరైటీ అనే మ్యాగజైన్ ప్రచురించిన సంగతి తెలిసిందే. 2023 ఫస్టాఫ్ లో మహేష్ సినిమా షూటింగ్ ను జక్కన్న మొదలుపెట్టనున్నారు. ఈ సినిమా ఆర్ఆర్ఆర్ మూవీని మించి సక్సెస్ సాధించే విధంగా రాజమౌళి జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అడ్వెంచరస్ థ్రిల్లర్ గా తెరకెక్కనున్న ఈ సినిమాకు సంబంధించి స్క్రిప్ట్ పనులు ఇప్పటికే మొదలయ్యాయి.

రాజమౌళి మహేష్ బాబుకు మినహా ఈ సినిమాకు సంబంధించిన విషయాలను ఎవరికీ చెప్పడానికి ఇష్టపడటం లేదని సమాచారం అందుతోంది. ఆర్ఆర్ఆర్ మూవీని బాగా ప్రమోట్ చేయడం ద్వారా తర్వాత సినిమాకు మరింత హైప్ వస్తుందని రాజమౌళి భావిస్తున్నారని బోగట్టా. రాజమౌళి మహేష్ హీరోగా తెరకెక్కే సినిమాను విదేశీ భాషల్లో కూడా రిలీజ్ చేయనున్నారని సమాచారం అందుతోంది.

మహేష్ జక్కన్న కాంబో మూవీ 600 కోట్ల రూపాయలకు పైగా బడ్జెట్ తో తెరకెక్కనుందని తెలుస్తోంది. రాజమౌళి సినిమాసినిమాకు తన రేంజ్ పెరిగేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మహేష్ బాబుతో తెరకెక్కించే సినిమా హాలీవుడ్ ప్రేక్షకులకు కూడా నచ్చేలా ఉంటుందని సమాచారం అందుతోంది. మహేష్ కు కెరీర్ బెస్ట్ హిట్ ఇవ్వాలని జక్కన్న భావిస్తున్నారు. మహేష్ జక్కన్న కాంబో మూవీలో హాలీవుడ్ హీరోయిన్ నటించే ఛాన్స్ అయితే ఉందని వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి.

లైగర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘లైగర్’ కచ్చితంగా చూడడానికి గల 10 కారణాలు..!
మహేష్ టు మృణాల్.. వైజయంతి మూవీస్ ద్వారా లాంచ్ అయిన స్టార్ల లిస్ట్..!
‘తమ్ముడు’ టు ‘లైగర్’… బాక్సింగ్ నేపథ్యంలో రూపొందిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus