కొన్నేళ్ల క్రితం వరకు దర్శకుడు రాజమౌళి గురించి తెలుగు రాష్ట్రాలు మినహా ఇతర రాష్ట్రాలకు పెద్దగా తెలియదు. అయితే బాహుబలి, బాహుబలి2 సక్సెస్ తో రాజమౌళి దేశంలోని సినీ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించారు. రాజమౌళి డైరెక్షన్ లో సినిమా తెరకెక్కితే ఆ సినిమా హిట్ అని ప్రేక్షకులు సైతం భావిస్తుండటం గమనార్హం. రాజమౌళి డైరెక్షన్ లో హీరో పాత్రల్లో నటించాలని తమిళ హీరోలతో పాటు హిందీ హీరోలు సైతం భావిస్తున్నారు.
అయితే ప్రస్తుతం పెద్దపెద్ద నటులు సైతం జక్కన్న సినిమాలో చిన్న పాత్ర దక్కినా చాలని అనుకుంటున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమాలో శ్రియ పాత్ర నిడివి కేవలం 4 నిమిషాలకు అటూఇటుగా ఉంటుంది. అయితే శ్రియ మాత్రం రాజమౌళి డైరెక్టర్ అని తెలిసిన వెంటనే సినిమాకు ఓకే చెప్పానని చెప్పుకొచ్చారు. అయితే ప్రస్తుతం స్టార్ యాక్టర్లు సైతం జక్కన్న సినిమాలో చిన్న పాత్ర దక్కినా చాలు అని చెబుతున్నారు. కొందరు స్టార్ హీరోయిన్లు రాజమౌళి డైరెక్షన్ లో ఒక్క సినిమాలో అయినా నటించాలని తమ కోరిక అని చెప్పుకొచ్చారు.
ఎన్టీఆర్, చరణ్ సైతం ఛాన్స్ దక్కితే జక్కన్న డైరెక్షన్ లో నటించడానికి సిద్ధమేనని వెల్లడించారు. బన్నీ, పవన్ కూడా రాజమౌళితో చేయాలని ఆసక్తి చూపిస్తున్నారు. రాజమౌళి మాత్రం మహేష్ సినిమా తర్వాత ఎవరితో సినిమాను తెరకెక్కిస్తారో క్లారిటీ ఇవ్వడం లేదు. జక్కన్న మాత్రం భారీ బడ్జెట్ సినిమాలకే ఓటేస్తూ కళ్లు చెదిరే గ్రాఫిక్స్ తో తెరకెక్కిన సినిమాల ద్వారా సినీ అభిమానులను కొత్త ప్రపంచంలోకి తీసుకెళుతున్నారు. సినిమాసినిమాకు రాజమౌళికి క్రేజ్ పెరుగుతుండగా జక్కన్న పారితోషికం కూడా అదే స్థాయిలో పెరుగుతోంది.
జక్కన్న తన రెమ్యునరేషన్ ను కూడా తెలివిగా ఇన్వెస్ట్ చేస్తున్నారని సమాచారం అందుతోంది. జక్కన్న ప్రతి సినిమాకు లాభాల్లో వాటా తీసుకుంటూ ఉండటంతో ఆ విధంగా ఊహించని స్థాయిలో రాజమౌళికి పారితోషికంగా దక్కుతోందని సమాచారం అందుతోంది.