స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ మూవీ మరో రెండు వారాల్లో థియేటర్లలో విడుదల కానుంది. అయితే ఆర్ఆర్ఆర్ రిలీజ్ విషయంలో స్టార్ డైరెక్టర్ రాజమౌళికి టెన్షన్ తప్పడం లేదు. ఇప్పటికే ఆర్ఆర్ఆర్ మూవీపై ఊహించని స్థాయిలో అంచనాలు పెరిగాయి. ఈ సినిమాకు రికార్డు స్థాయిలో బిజినెస్ జరిగింది. అయితే హైదరాబాద్ లో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ అతి త్వరలో జరగాల్సి ఉంది. ఆర్ఆర్ఆర్ సినిమా ప్రమోషన్ ఈవెంట్ ఒకటి అభిమానుల వల్ల క్యాన్సిల్ అయిన సంగతి తెలిసిందే.
ఆర్ఆర్ఆర్ ముంబై ఈవెంట్ లో కూడా చరణ్, తారక్ ఫ్యాన్స్ రచ్చరచ్చ చేశారు. ఆర్ఆర్ఆర్ హైదరాబాద్ ఈవెంట్ కు భారీస్థాయిలో ఫ్యాన్స్ హాజరయ్యే ఛాన్స్ ఉంది. ఏ చిన్న పొరపాటు జరిగినా ఫ్యాన్స్ ను కంట్రోల్ చేయడం సులువు కాదు. ఎంతమంది సెక్యూరిటీ ఉన్నా ఫ్యాన్స్ వల్ల మేకర్స్ కు ఇబ్బందులు తప్పవు. మరోవైపు తెలంగాణ రాష్ట్రంలో ఒమిక్రాన్ కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. ఒమిక్రాన్ కేసులు మరింత పెరిగితే పూర్తిస్థాయిలో కాకపోయినా కేసులు నమోదైన ప్రాంతాల్లో లాక్ డౌన్ ను అమలు చేసే ఛాన్స్ ఉంది.
ఆర్ఆర్ఆర్ పాన్ ఇండియా సినిమా కావడంతో రిలీజ్ డేట్ ను మార్చే అవకాశం కూడా లేదు. థర్డ్ వేవ్ భయాల వల్ల థియేటర్లలో సినిమాలు చూడటానికి ప్రేక్షకులు ఆసక్తి చూపుతారో లేదో చూడాల్సి ఉంది. మరోవైపు ఉత్తరాది రాష్ట్రాల్లో 50 శాతం ఆక్యుపెన్సీ నిబంధనలు అమలులో ఉన్నాయి. అమెరికా, బ్రిటన్ లో కూడా ఒమిక్రన్ కేసులు నమోదవుతున్నాయి. ఏపీలో టికెట్ రేట్లు తక్కువగా ఉండటం, ఏపీలో అధికారులు జరుపుతున్న దాడుల వల్ల థియేటర్లు మూతబడటం జరుగుతోంది.
ఆర్ఆర్ఆర్ రిలీజ్ సమయంలో రాజమళిని, మేకర్స్ ను ఎన్నో సమస్యలు ఇబ్బందులు పెడుతున్నాయి. ఆర్ఆర్ఆర్ కు యునానిమస్ పాజిటివ్ టాక్ వస్తే మాత్రమే ఎన్ని సమస్యలు ఎదురైనా ఈ సినిమా భారీగా కలెక్షన్లను సాధించే ఛాన్స్ ఉందని చెప్పవచ్చు.