దర్శకధీరుడు రాజమౌళికి ఎక్కడా లేని తిప్పలు వచ్చి పడుతున్నాయి. చరణ్, ఎన్టీఆర్ లతో అయన ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న భారీ మల్టీస్టారర్ చిత్రంలో ‘ఆర్ ఆర్ ఆర్’. ఇందులో ఎన్టీఆర్ కొమరం భీమ్ గా కనిపిస్తుండగా.. చరణ్ అల్లూరి సీతారామరాజుగా కనిపించబోతున్నాడు. డీవీవీ దానయ్య 400 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎం.ఎం.కీరవాణి సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకుంది. ఇక రెండో షెడ్యూల్ ప్రారంభమైనా చరణ్ కు గాయమవ్వడంతో షూటింగ్ కు బ్రేక్ పడింది.
ఇక ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన నటించాల్సిన డైసీ ఎడ్గార్‌జోన్స్ కొన్ని కారణాల వల్ల తప్పుకుంది. దీంతో ఎన్టీఆర్ కు జోడిగా బాలీవుడ్ నటి శ్రద్ధ కపూర్ ని తీసుకున్నట్లు తెలుస్తుంది. అంతే కాదు ఈమె కోసం కథను కూడా మార్చబోతున్నాడట. ఒకవేళ ఈమె కూడా తప్పుకుంటే.. పరిణీతి చోప్రాని తీసుకోబోతున్నట్టు తెలుస్తుంది. అప్పుడు కూడా కొన్ని కీలక మార్పులు చేయాల్సి ఉందట. ఇప్పటికే హీరోయిన్ హ్యాండివ్వడంతో చాలా ఇబ్బందుల పడుతున్న జక్కన్న కి మళ్ళీ హీరోయిన్ల కోసం కథలో మార్పులు చేయడం.. జక్కన్నకి పెద్ద తలనొప్పిగా మారిందని ఫిలింనగర్ విశ్లేషకులు చెప్పుకొస్తున్నారు.