Rajamouli vs Sukumar: రాజమౌళి, సుకుమార్..ల గత 5 సినిమాల బడ్జెట్ & కలెక్షన్స్..!

టాలీవుడ్లో నెంబర్ వన్ రేసులో ఉన్న డైరెక్టర్స్ ఇప్పుడు ఇద్దరే ఇద్దరు. ఒకరు.. ఏ డౌట్ లేకుండా రాజమౌళి (S. S. Rajamouli). ఆ నెక్స్ట్ ప్లేస్ కోసం చాలా మంది దర్శకులు పోటీ పడుతున్నారు. అయితే ‘పుష్ప 2’ (Pushpa 2: The Rule) తో పాన్ ఇండియా ఇమేజ్ తెచ్చుకున్న సుకుమార్ (Sukumar) ప్రస్తుతానికి రెండో ప్లేస్లో నిలిచాడు. తాజాగా రిలీజ్ అయిన ‘పుష్ప 2’ తో సుకుమార్ రేంజ్ మరింత పెరిగింది. ఈ సినిమాతో చాలా చోట్ల అతను రాజమౌళి ‘బాహుబలి 2’ రికార్డులని బ్రేక్ చేశాడు.

Rajamouli vs Sukumar

వెయ్యి కోట్ల క్లబ్లో స్థానం సంపాదించుకున్నాడు. సో ప్రస్తుతానికి టాలీవుడ్లో నెంబర్ వన్ ప్లేస్ కోసం పోటీపడుతున్న దర్శకులు రాజమౌళి, సుకుమార్ అనడంలో ఎటువంటి సందేహం లేదు. మరి ఈ దర్శకుల గత 5 సినిమాల బడ్జెట్ మరియు కలెక్షన్స్ లెక్కల్ని ఓ లుక్కేద్దాం రండి :

ముందుగా రాజమౌళి గత 5 సినిమాల బడ్జెట్ & కలెక్షన్స్ ని గమనిస్తే :

1) మర్యాద రామన్న  :

సునీల్ హీరోగా ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘మర్యాద రామన్న’ (Maryada Ramanna) . ‘ఆర్కా మీడియా వర్క్స్’ బ్యానర్ పై శోభు యార్లగడ్డ (Shobu Yarlagadda) , ప్రసాద్ దేవినేని (Prasad Devineni) ఈ చిత్రాన్ని రూ.14 కోట్ల బడ్జెట్ తో నిర్మించారు. ఈ సినిమా ఫుల్ రన్లో రూ.28.5 కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసింది.

2) ఈగ (Eega) :

నాని (Nani), సమంత (Samantha) ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమాలో సుదీప్ (Sudeep) విలన్ గా నటించాడు. చిన్న బడ్జెట్లో ఈ చిత్రాన్ని తెరకెక్కించాలి అని మొదట రాజమౌళి అనుకున్నారు. ‘వారాహి చలన చిత్రం’ బ్యానర్ పై సాయి కొర్రపాటి (Sai Korrapati) ఈ చిత్రానికి నిర్మాత. ఫైనల్ గా దీనికి రూ.35 కోట్లు బడ్జెట్ అయ్యింది. థియేట్రికల్ రిలీజ్లో ఫుల్ రన్ ముగిసేసరికి ఈ సినిమా రూ.125 కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసింది.

3) బాహుబలి(ది బిగినింగ్) (Baahubali) :

ప్రభాస్ (Prabhas) హీరోగా రానా దగ్గుబాటి (Rana Daggubati) విలన్ గా తెరకెక్కిన ఈ చిత్రానికి రాజమౌళి దర్శకుడు. ‘ఆర్కా మీడియా వర్క్స్’ బ్యానర్ పై శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని ఈ చిత్రాన్ని రూ.180 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మించారు. అయితే ఫుల్ రన్లో ఈ సినిమా రూ.600 కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసింది.

4) బాహుబలి 2 (ది కన్క్లూజన్) (Baahubali 2) :

ప్రభాస్ హీరోగా రానా దగ్గుబాటి విలన్ గా నటించిన ఈ చిత్రానికి రాజమౌళి దర్శకుడు. ‘ఆర్కా మీడియా వర్క్స్’ బ్యానర్ పై శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని ఈ చిత్రాన్ని రూ.250 కోట్ల బడ్జెట్ తో నిర్మించారు. ఫుల్ రన్లో ఈ సినిమా రూ.1810 కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసింది. ఇప్పటివరకు ‘బాహుబలి 2’ కలెక్షన్స్ ని ఏ టాలీవుడ్ సినిమా కూడా అధిగమించలేకపోయింది.

5) ఆర్.ఆర్.ఆర్ (RRR) :

రాంచరణ్ (Ram Charan) , ఎన్టీఆర్(Jr NTR)..లు హీరోలుగా టాలీవుడ్లో రూపొందిన బిగ్గెస్ట్ మల్టీస్టారర్ మూవీ ఇది. రాజమౌళి డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని ‘డీవీవీ ఎంటర్టైన్మెంట్’ బ్యానర్ పై డీవీవీ దానయ్య (D. V. V. Danayya) రూ.550 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మించారు. ఈ సినిమా ఫుల్ రన్లో బాక్సాఫీస్ వద్ద రూ.1380 కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసింది.

సుకుమార్ డైరెక్ట్ చేసిన గత 5 సినిమాల బడ్జెట్ & కలెక్షన్స్ :

1) 100% లవ్

సుకుమార్ (Sukumar) , నాగచైతన్య (Naga Chaitanya) కాంబినేషన్లో ‘100% లవ్’ (100% Love) రూపొందింది. ‘గీతా ఆర్ట్స్’ బ్యానర్ పై అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాస్ (Bunny Vasu) ఈ చిత్రాన్ని రూ.10 కోట్ల బడ్జెట్ తో నిర్మించాడు. ఫుల్ రన్లో ఈ సినిమా రూ.35.6 కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసింది.

2) 1 నేనొక్కడినే (1: Nenokkadine) :

సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu), సుకుమార్ కాంబినేషన్లో రూపొందిన సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ ఇది. ’14 రీల్స్ ఎంటర్టైన్మెంట్’ బ్యానర్ పై రామ్ ఆచంట (Ram Achanta) , గోపీచంద్ ఆచంట(Gopichand Achanta), అనిల్ సుంకర (Anil Sunkara)..లు ఈ చిత్రాన్ని రూ.70 కోట్ల బడ్జెట్ తో నిర్మించారు. ఫుల్ రన్లో ఈ సినిమా రూ.57.2 కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసింది.

3) నాన్నకు ప్రేమతో (Nannaku Prematho) :

ఎన్టీఆర్ (Jr NTR), సుకుమార్ కాంబినేషన్లో రూపొందిన ఈ చిత్రాన్ని ‘శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర’ బ్యానర్ పై బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ (B. V. S. N. Prasad) రూ.50 కోట్ల బడ్జెట్ తో నిర్మించారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫైనల్ గా రూ.87 కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసింది

4) రంగస్థలం :

రాంచరణ్ (Ram Charan) , సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కిన మాస్ అండ్ రూరల్ ఎమోషనల్ డ్రామా ‘రంగస్థలం’ (Rangasthalam) . ‘మైత్రి మూవీ మేకర్స్’ బ్యానర్ పై నవీన్ ఎర్నేని (Naveen Yerneni), వై.రవి శంకర్ (Y .Ravi Shankar)..లు ఈ చిత్రాన్ని రూ.75 కోట్ల బడ్జెట్ తో నిర్మించారు. ఫుల్ రన్లో ఈ సినిమా రూ.216 కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసింది.

5) పుష్ప(ది రైజ్) :

అల్లు అర్జున్ (Allu Arjun)  , సుకుమార్ కాంబినేషన్లో రూపొందిన మూడో సినిమా ‘పుష్ప'(ది రైజ్) (Pushpa: The Rise) . ఈ చిత్రాన్ని ‘మైత్రి మూవీ మేకర్స్’ బ్యానర్ పై నవీన్ ఎర్నేని, వై.రవి శంకర్..లు రూ.250 కోట్ల బడ్జెట్ తో నిర్మించారు. ఈ సినిమా ఫుల్ రన్లో రూ.350 కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసింది.

6) పుష్ప 2(ది రూల్) :

అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో రూపొందిన నాలుగో సినిమా ‘పుష్ప 2′(ది రూల్). ఈ చిత్రాన్ని ‘మైత్రి మూవీ మేకర్స్’ బ్యానర్ పై నవీన్ ఎర్నేని, వై.రవి శంకర్..లు రూ.450 కోట్ల బడ్జెట్ తో నిర్మించారు. ఈ సినిమా ఇప్పటివరకు రూ.800 కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసింది.

‘పుష్ప 2’ తో పాటు మొదటి రోజు అత్యధిక గ్రాస్ కలెక్షన్స్ రాబట్టిన 10 సినిమాలు!

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus