అల వైకుంఠపురంలో చిత్రంతో దర్శకుడు త్రివిక్రమ్ బ్యాక్ టు ఫార్మ్ అని సందేశం పంపారు. రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్ తో దూసుకుపోతున్న ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవడం ఖాయంగా కనిపిస్తుంది. ఇక అల వైకుంఠపురంలో మూవీ యూఎస్ బాక్సాపీస్ వద్ద $2 మిలియన్ వసూళ్లు దాటివేసింది. హీరో అల్లు అర్జున్ కెరీర్ లో $2 మిలియన్ వసూళ్లు సాధించిన మొదటి చిత్రంగా అల వైకుంఠపురంలో నిలిచింది. కాగా దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ టాలీవుడ్ నుండి ఓ అరుదైన రికార్డు సొంతం చేసుకున్నాడు. యూఎస్ బాక్సాపీస్ వద్ద నాలుగు $2 మిలియన్ వసూళ్లు సాధించిన చిత్రాల దర్శకుడు గా రికార్డ్స్ కి ఎక్కాడు. గతంలో ఆయన తెరకెక్కించిన అజ్ఞాతవాసి, అ ఆ, అరవింద సమేత చిత్రాలు $2 మిలియన్ మార్కుని చేరుకున్నాయి.
త్రివిక్రమ్ మాత్రమే నాలుగు సార్లు ఈ ఫీట్ సాధించారు. దర్శక ధీరుడు రాజమౌళి కూడా కేవలం రెండు సార్లే $2 మిలియన్ మార్క్ చేరుకున్నారు. ఆయన ప్రభాస్ హీరోగా చేసిన బాహుబలి, బాహుబలి 2 చిత్రాలు $2 మిలియన్ వసూళ్లను దాటాయి. ఇక శివ కొరటాల(భరత్ అనే నేను, శ్రీమంతుడు) , సుకుమార్(నాన్నకు ప్రేమతో, రంగస్థలం) కూడా రెండు సార్లు $2 మిలియన్ వసూళ్లను టచ్ చేయడం జరిగింది. యూఎస్ లో త్రివిక్రమ్ సినిమాలకు చాల డిమాండ్ ఉంటుంది. సాధారణంగా క్లాస్ మూవీస్ ఇష్టపడే యూఎస్ ఆడియెన్స్ త్రివిక్రమ్ చిత్రాల పట్ల ఆసక్తి చూపిస్తారు. అట్టర్ ప్లాప్ టాక్ తెచ్చుకున్న అజ్ఞాతవాసి మూవీ కూడా ఆయన మేనియాతో రికార్డ్ ఓపెనింగ్స్ దక్కించుకుంది.