కొమరం భీమ్ వీడియోకి రంగం సిద్ధమవుతోందా?

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రం రోజు రోజుకీ హాట్ టాపిక్ గా ఉంటూనే ఉంటుంది. రాంచరణ్,ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోలు కలిసి నటిస్తుండడం.. అందులోనూ ‘బాహుబలి'(సిరీస్) తర్వాత రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రం కావడంతో దీని పై అన్ని భాషల్లో ఉన్న ప్రేక్షకులు భారీ అంచనాలే పెట్టుకున్నారు. ఈ చిత్రం కోసం విదేశాల్లో ఉండే ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఈ చిత్రంలో అల్లూరి సీతారామరాజుగా చరణ్… కొమరం భీమ్ గా ఎన్టీఆర్ నటిస్తున్నారు. ఇప్పటికే రాంచరణ్ పుట్టినరోజున ‘భీమ్ ఫర్ రామరాజు’ అంటూ ఓ వీడియోని విడుదల చేశారు.

ఆ వీడియోలో రాంచరణ్ మేక్ ఓవర్ అలాగే ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. దాంతో ‘రామరాజు ఫర్ భీమ్’ వీడియో అంటూ ఎన్టీఆర్ బర్త్ డే కు కూడా ఓ వీడియోని రిలీజ్ చేస్తారని ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూసారు. ‘అసలే సంవత్సరంన్నర పైనే ఎన్టీఆర్ సినిమా లేదు. కనీసం ఎన్టీఆర్ పుట్టినరోజున అయినా వీడియోని విడుదల చేస్తారు’.. అనుకుని ఎన్నో ఆశలు పెట్టుకున్న ఎన్టీఆర్ అభిమానులకు నిరాశే మిగిలింది. లాక్ డౌన్ కారణంగా ఆ వీడియో మేకింగ్ కు కావాల్సిన సదుపాయాలు లేకపోవడం వల్లే వీడియో రిలీజ్ చేయలేకపోయామని నిర్మాతలు తెలిపారు.

అయితే ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాత్రం రాజమౌళి పై ఫైర్ అవుతున్నారు. సోషల్ మీడియాలో రాజమౌళిని గట్టిగానే టార్గెట్ చేశారు. దీంతో రాజమౌళి వీలైనంత త్వరగా ఎన్టీఆర్ వీడియో కోసం పనులను మొదలు పెడుతున్నాడట.వీలైనంత త్వరగా.. ఎన్టీఆర్ ఫ్యాన్స్ ను ఖుషీ చెయ్యాలని భావిషతున్నాడట. ఎలాగు ఇప్పుడు రాజమౌళితో ట్రయిల్ షూటింగ్ జరిపించాలి అని ఇండస్ట్రీ పెద్దలు అనుకుంటున్నారు కాబట్టి.. కేవలం ఆ వీడియో కోసమే ప్రత్యేక షూటింగ్ కూడా మొదలుపెట్టాలని రాజమౌళి భావిస్తున్నాడట. మరి ఈ వార్తలో ఎంతవరకూ నిజముందో తెలియాల్సి ఉంది.

Most Recommended Video

రన్ మూవీ రివ్యూ & రేటింగ్
జ్యోతిక ‘పొన్‌మగల్‌ వందాల్‌’ రివ్యూ
ఈ డైలాగ్ లు చెప్పగానే గుర్తొచ్చే హీరోయిన్లు!
ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన 12 సినిమాలు!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus