SSMB29: ఈ స్పీడ్ అసలు ఊహించలేదే.. నిజమేనా?

ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి (S. S. Rajamouli)  ఆలస్యం గురించి అందరికీ తెలిసిందే. అతని సినిమా ఒక్కో ఫ్రేమ్ ప‌ర్ఫెక్ట్‌గా ఉండాలి అనే డెడికేషన్‌కి గుర్తింపు ఉంది. ఆర్ఆర్ఆర్ (RRR) వంటి పాన్ ఇండియా బ్లాక్‌బస్టర్ త‌ర్వాత రాజ‌మౌళి సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబుతో  (Mahesh Babu)  ఎస్‌ఎస్‌ఎంబీ29 (SSMB29) చిత్రాన్ని మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. ఇది ఓ అడ్వెంచ‌ర్ డ్రామాగా రూపుదిద్దుకుంటుండగా, ప్రీ ప్రొడక్షన్ నుంచి ఇప్పటి వరకు చాలా డీటెయిల్డ్‌గా వర్క్ చేస్తున్నారని అనిపించింది. కానీ ఇప్పుడు రాజ‌మౌళి తన స్టయిల్‌కు భిన్నంగా, ఎక్స్‌ట్రా స్పీడ్‌తో షూటింగ్ పూర్తి చేస్తున్నట్టు తెలుస్తోంది.

SSMB29

ఇప్పటివరకు ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి ఎటువంటి అధికారిక అప్డేట్ ఇవ్వకుండా రెండు షెడ్యూళ్లను పూర్తి చేయడం ఆశ్చర్యం కలిగిస్తోంది. తాజా సమాచారం ప్రకారం, మూడో షెడ్యూల్ కూడా ఇప్పటికే స్టార్ట్ అయ్యిందట. ఇందులో ప్రియాంక చోప్రా (Priyanka Chopra) కూడా జాయిన్ అయ్యారన్న వార్తలు ఫిలింనగర్ వర్గాల్లో వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఫారిన్ లొకేషన్స్‌లో కొన్ని కీలకమైన అడ్వెంచర్ సీన్స్‌ను చిత్రీకరించిన రాజ‌మౌళి, ప్రస్తుతం ఇండియాలో ప్రత్యేకంగా సెట్ చేసిన ఒక ఫారెస్ట్ వేదికపై కీలక ఎపిసోడ్స్‌ను షూట్ చేస్తున్నారని సమాచారం.

ఈసారి అనుకున్న సమయానికి సినిమా కంప్లీట్ చేయాలనే టార్గెట్‌తో రాజమౌళి ముందుకు వెళ్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో మహేష్ బాబు లుక్, నటన, యాక్షన్ అన్నీ మరో లెవెల్లో ఉంటాయని టాక్. ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించి రాజ‌మౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ (Vijayendra Prasad) ఇప్పటికే స్టోరీ అంశాలపై క్లారిటీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ప్రపంచ యాత్రికుడి పాత్రలో మహేష్ బాబు కనిపించబోతున్న ఈ చిత్రం ద్వారా ఇండియన్ సినిమా కొత్త అడ్వెంచర్ వెబ్‌ని ఫీల్ కానున్నట్లు అంచనాలు ఉన్నాయి.

మరి ఆ అంచనాలకు తగినట్లుగా ఈ స్పీడ్ కొనసాగుతుందా? అన్నది ఆసక్తికరంగా మారింది. మొత్తానికి జక్కన్న గతంలో కంటే ఈసారి డిఫరెంట్ ప్లానింగ్‌తో ముందుకెళ్తున్నాడు. షూటింగ్ స్పీడ్ చూస్తుంటే 2026 కంటే ముందే రిలీజ్ ప్లాన్ చేయబోతున్నారా అనే ప్రశ్న కూడా ఇప్పుడు ఉత్కంఠ కలిగిస్తోంది. ఇకపై ఎస్‌ఎస్‌ఎంబీ29కి సంబంధించిన అధికారిక అప్డేట్ ఎప్పుడు వస్తుందన్నదే ప్రస్తుతం ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న విషయం.

సూర్య గురించి తండ్రి శివ కుమార్‌ ఆసక్తికర వ్యాఖ్యలు.. ఫస్ట్‌ మావాడే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus